హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత

హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది.వైఎస్ షర్మిల కోసం వైఎస్ విజయమ్మ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.

అయితే విజయమ్మ లోపలికి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు.దీంతో ఆమె పోలీస్ స్టేషన్ ఎదుట కారులోనే ఉండిపోయారు.

అనంతరం విజయమ్మను అక్కడి నుంచి పోలీసులు బలవంతంగా తరలించారు.అయితే ఉదయం లోటస్ పాండ్ ఇంటి వద్ద షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు.

ఈ క్రమంలో షర్మిల పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.తరువాత మహిళా కానిస్టేబుల్ తో పాటు మరో పోలీసును నెట్టివేశారు.

Advertisement

అనంతరం షర్మిలను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించి, ఆమెపై పోలీసులు 350, 330 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?
Advertisement

తాజా వార్తలు