Ambati Rambabu : వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత..!!

వైసీపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు( Ambati Rambabu ) ఇంటి వద్ద యూత్ కాంగ్రెస్ నాయకులూ నిరసనలు తెలియజేయడం జరిగింది.

ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ పోస్టులను వ్యతిరేకిస్తూ సత్తెనపల్లిలో నిరుద్యోగులు ఆందోళనకు దిగారు.

ఇది దగా డీఎస్సీ.మెగా డీఎస్సీ( Mega DSC ) కావాలంటూ.

నినాదాలు చేశారు.పాతికవేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.2019 ఎన్నికల ప్రచారంలో పాతికవేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.ఆ రకంగానే ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు.

నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై వైసీపీ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తుందని విమర్శలు చేశారు.

Advertisement

ఈ నిరసన కార్యక్రమంలో బైబై జగన్, బైబై వైసీపీ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి యూత్ కాంగ్రెస్ నాయకులను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేయడం జరిగింది.ఈ క్రమంలో తోపులాట జరగటంతో పాటు వాగ్వాదం చోటుచేసుకుంది.

వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.ఇప్పటికైనా సమయం మించిపోలేదు.

ప్రభుత్వం దిగిరావాలని.మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని పేర్కొన్నారు.

దీంతో యూత్ కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అనంతరం పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
50 రోజుల్లో 11 వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం.. పవర్ స్టార్ పవన్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

అయితే రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకూ తమ పోరాటం ఆగదని యూత్ కాంగ్రెస్( Youth Congress ) నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు