40 ఏళ్ళ వయసులోనూ యంగ్ గా కనిపిస్తున్నఈ  తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..?

తెలుగు లో సీనియర్ హీరో శ్రీకాంత్ హీరోగా నటించిన "ఓ చిన్నదాన" చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన తమిళ బ్యూటీ "శృతి రాజ్" గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అయితే ఈ అమ్మడు మొదటిగా తెలుగులో వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన "వీడెక్కడి మొగుడండీ" అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైంది.

ఆ తర్వాత ఓ చిన్నదాన చిత్రంతో మంచి హిట్ అందుకున్నప్పటికీ పలు వ్యక్తిగత కారణాల వల్ల సినిమా పరిశ్రమకి దూరమైంది.కానీ తమిళం, మలయాళం, కన్నడ, తదితర భాషలలో మాత్రం వరుస సినిమాలు చేస్తూ బాగానే రాణించింది.

 అయితే ఈ మధ్య కాలంలో నటి శృతి రాజ్ సోషల్ మీడియా మాధ్యమాలలోబాగానే యాక్టివ్ గా ఉంటుంది.అంతేకాకుండా అప్పుడప్పుడు పలు రకాల ఫోటోషూట్ కార్యక్రమాలలో పాల్గొంటూ అందమైన ఫోటోలకి ఫోజులు ఇస్తోంది.

అలాగే ఈ ఫోటోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ తన అభిమానులకు అందాల విందు చేస్తోంది.దీంతో కొంతమంది నెటిజన్లు ఈ అమ్మడి అందాల ఆరబోత కి ఫిదా అయ్యారు.

Advertisement

మరికొందరైతే ఏకంగా 40 ఏళ్ళ వయస్సులో కూడా వన్నె తరగని అందంతో నటి శృతి రాజ్ మెరిసిపోతోందంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.కాగా ప్రస్తుతం ఈ అమ్మడి అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాని దాదాపుగా మూడు లక్షల పైచిలుకు మంది ఫాలో అవుతున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా నటి శృతి రాజ్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, తదితర భాషలలో కలిపి దాదాపుగా 20 కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.నటన పరంగా ఎంతో ప్రతిభ ఉన్నటువంటి వ్యక్తిగత కారణాల వల్లే అప్పట్లో సినిమా పరిశ్రమకు దూరం అయింది.

అంతేకాకుండా పలువురి స్టార్ హీరోల చిత్రాలలో నటించే అవకాశాలు కూడా చేజార్చుకుందని పలు కథనాలు వినిపించాయి.కాగా నటి శృతి రాజ్ కేవలం వెండితెర ప్రేక్షకులను మాత్రమే కాకుండా పలు ధారావాహికలలో నటించి బుల్లితెర ప్రేక్షకులను కూడా బాగానే అలరించింది.

కాగా తెలుగులో అప్పట్లో ప్రసారమయ్యే  శ్రావణి సుబ్రహ్మణ్యం అనే ధారావాహికలో నటించి బుల్లితెర ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంది.కాగా ప్రస్తుతం శృతి రాజ్  ప్రముఖ తమిళ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయిన సన్ టీవీలో ప్రసారమయ్యే ధారావాహికలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు