ఈ హీరోయిన్ 22 ఏళ్లకే పెళ్లి చేసుకుని సినిమా ఇండస్ట్రీ ని వదిలిపెట్టి ప్రస్తుతం...

తెలుగులో ప్రముఖ దర్శకుడు కే.

విజయ భాస్కర్ దర్శకత్వం వహించిన "స్వయంవరం" చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సీనియర్ హీరోయిన్ "లయ" గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 అయితే అంతకు ముందే "భద్రం కొడుకో" అనే చిత్రంలో లయ నటించినప్పటికీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో ఈమెకి పెద్దగా గుర్తింపు రాలేదు.కానీ తన రెండవ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించడంతో వరుస సినిమా అవకాశాలు క్యూ కట్టాయి.

Telugu Veteran Heroine Laya Real Life Story,Laya, Telugu Veteran Heroine-ఈ �

అయితే ఇందులో మనసున్న మారాజు, శివరామరాజు, మనోహరం, ప్రేమించు, విజయేంద్ర వర్మ, తదితర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులని బాగానే ఆకట్టుకోవడంతో పాటూ మంచి గుర్తింపు తెచ్చాయి.ఒకానొక సమయంలో చేతినిండా సినిమా అవకాశాలతో బాగానే రాణిస్తున్న సమయంలో అమెరికాలో డాక్టర్ గా ఉద్యోగం చేస్తున్నటువంటి ఓ ప్రముఖ వైద్యుడు ని పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయ్యింది.

  ప్రస్తుతం ఒక బాబు, పాప కూడా ఉన్నారు.  ఆ మధ్య టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించినటువంటి అమర్ అక్బర్ ఆంథోనీ చిత్రంలో తన కూతురు శ్లోక తో కలిసి నటించింది.

Advertisement

అతి చిన్న వయసులో నటిగా సినిమా పరిశ్రమకు పరిచయమై పెళ్లి చేసుకున్న అనంతరం తన కుటుంబ బాధ్యతల కోసమై నటి లయ సినిమా కెరీర్ ను కూడా వదులుకుంది.అయితే ఆ మధ్య కాలంలో ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో నటి లయ పాల్గొంది.

ఇందులో భాగంగా తనకు ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించే అవకాశం వస్తే మళ్లీ తాను సినిమాల్లో నటించేందుకు సిద్ధమేనంటూ తెలిపింది.అంతేగాక తాను ప్రస్తుతం తాను తన భర్త పిల్లలతో కలిసి అమెరికాలో ఉండడం వల్ల సినిమాల్లో నటించలేకపోతున్నానని తన అభిప్రాయాన్ని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు