అందుకే ప్రతీ నెల పూరీ జగన్నాథ్ నాకు డబ్బులు పంపిస్తుంటాడు...

తెలుగులో దాదాపుగా 40 సంవత్సరాల నుంచి నటిస్తూ దాదాపుగా సీనియర్ నుంచి జూనియర్ వరకూ అందరి స్టార్ హీరోల చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో కనిపించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన "సీనియర్ నటి రమాప్రభ" గురించి తెలుగు సినీ  పరిశ్రమలో తెలియని వారుండరు.

  అయితే అప్పట్లో రమాప్రభ పలు చిత్రాల్లో హీరోయిన్ గా  నటించినప్పటికీ ఆ చిత్రాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

 దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించినా  నటిగా మంచిగుర్తింపు తెచ్చుకుంది.అయితే టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు ని పెళ్లి చేసుకొని పలు వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు ఇచ్చింది.

అనంతరం రమాప్రభ ఒంటరిగా చిత్తూరు జిల్లాలోని మదనపల్లి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి తన సొంత నివాసంలో నివాసముంటోంది.అయితే తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో రమాప్రభ పాల్గొంది.

అయితే ఇందులో భాగంగా ఇంటర్వ్యూ చేసేటువంటి వ్యక్తి "మీకు ప్రతినెల టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ దర్శకుడు డబ్బులు పంపిస్తారని" పలు వార్తలు వినిపిస్తున్నాయని నిజమేనా.? అంటూ ప్రశ్నించాడు.దీంతో రమాప్రభ ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ నిజమేనని ఆ దర్శకుడు ఎవరో కాదు ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ అని తెలిపింది.

Advertisement

అయితే తనకు పూరి జగన్నాథ్ డబ్బులు పంపిస్తున్నట్లు మొదట్లో తెలియలేదని తర్వాత తన క్యాషియర్ మూడు నెలల తర్వాత చెప్పాడని చెప్పుకొచ్చింది.అంతేకాక దాదాపుగా నాలుగు సంవత్సరాల క్రితం నుంచి పూరి జగన్నాథ్ తనకు నెల నెల 5వ తారీఖున డబ్బులు పంపిస్తాడని కానీ ఇప్పటివరకు ఒక్క సారి కూడా పూరి జగన్నాథ్ తో మాట్లాడలేదని తెలిపింది.

అయితే తమ మధ్య జన్మ జన్మల రుణానుబంధం ఉందని అందువల్లనే పూరిజగన్నాథ్ తనకు డబ్బులు పంపిస్తున్నాడని అంతేతప్ప అందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేసింది.అంతేకాక ఆ మధ్య ఓ సినిమా షూటింగ్లో కలిసినప్పుడు తన వద్దకు వచ్చి యోగక్షేమాలు అడిగాడని అనంతరం ఫోన్ నెంబర్ తీసుకుని  అక్కడి నుంచి వెళ్లిపోయాడని ఆ తరువాత తాను ఇబ్బందులు పడుతున్నట్లు ఇతరుల నుంచి తెలుసుకొని అప్పటి నుంచి డబ్బులు పొందుతున్నట్లు కూడా తెలిపింది.

Advertisement

తాజా వార్తలు