ఇద్దరూ ఇద్దరే ! ఎక్కడా తగ్గరంతే

తాము చెప్పిందే వేదం, మేము ఏది అనుకుంటే అదే చేస్తాం, మేము ఎవరి మాట వినం, అనే ధోరణి లో కొంతమంది ఉంటారు.

అలాంటి వారినే మొండి వారు అంటారు.

ఇప్పుడు అటువంటి మొండి వారిగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు కెసిఆర్, జగన్ ఆ విధమైన ముద్ర వేయించుకుంటున్నారు.దీనిపై విమర్శలు తీవ్రస్థాయిలో వస్తున్నా వారు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.

ప్రస్తుతం తెలంగాణలో ఆర్టీసీ సమ్మె తీవ్రస్థాయిలో కొనసాగుతోంది.మరోపక్క హుజూర్ నగర్ లో ఉప ఎన్నిక జరుగుతోంది.

ఈ నేపథ్యంలో విపక్ష పార్టీల్లో అసమ్మతి రాగం వినిపించిన నాయకులంతా ఏకమై కలిసికట్టుగా తమ పార్టీ విజయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.కానీ సీఎం కేసీఆర్ మాత్రం తన మొండి పట్టుదలను వదలకుండా విమర్శల పాలవుతున్నారు.

Advertisement

  ఇక ఏపీ విషయానికి వస్తే జగన్ కూడా అదే విధమైన రూట్లో వెళుతున్నాడు.తాను పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయడమే కాకుండా అన్ని శాఖల్లో తన మార్క్ కనపడాలని, గత టిడిపి ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలకు పులి స్టాప్ పెట్టాలని చూస్తున్నాడు.దీనికోసమే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ముందుకు వెళ్తున్నాడు.

కానీ ప్రస్తుతం ఏపీలో ఇసుక కొరత తీవ్ర స్థాయిలో ఏర్పడడంతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలయింది.దీంతో పాటు ఉపాధి లేక కూలీలు వలస బాట పడుతున్నారు.

అయినా నూతన ఇసుక పాలసీ పై జగన్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.అలాగే రాజధాని అమరావతి విషయంలోనూ జగన్ ఇదే మొండివైఖరి ప్రదర్శిస్తున్నాడు.

తెలుగు రాష్ట్రాల సీఎం లు ఇద్దరి మొండివైఖరి కారణంగా అభివృద్ధికి సంబంధించి తీవ్రమైన నా కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
తెలంగాణ లోక్ సభ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న సీపీఎం..!!

  దీనికితోడు ఆర్థిక మాంద్యం తీవ్రంగా ఉండడంతో ఆ ప్రభావం ప్రజల పైన, ప్రభుత్వం పైన ఎక్కువగా కనిపిస్తోంది.ఆ ప్రభావంతోనే తెలంగాణ ఏపీ రెండు చోట్ల ప్రభుత్వాలపై తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది.ఇదే సరేనా సమయంగా విపక్ష పార్టీలు ప్రభుత్వం పై మరింత వ్యతిరేకతను పెంచే పనిలో పడ్డాయి.

Advertisement

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు విషయంలో పోటా పోటీగా ముందుకు వెళుతున్నాయి.ఆర్థికంగా భారమైన భవిష్యత్తులోనూ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నా కొత్త కొత్త పథకాలు ప్రవేశపెడుతూ ముందుకు వెళ్తున్న వీరి తీరుపై రెండు రాష్ట్రాల్లోనూ ప్రశంసలు, విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.

తాజా వార్తలు