అరుదైన మైలురాయిని చేరుకున్న ఆహా.. అల్లు వారి పనితనంకు నిదర్శణం

ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల క్రేజ్‌ తగ్గి పోయి మెల్ల మెల్లగా ఓటీటీ వైపు అంతా జనాలు మల్లుతున్నారు.

ఇలాంటి సమయంలో తెలుగు లో ప్రత్యేకంగా ఒక ఓటీటీ ఉండాలనే ఉద్దేశ్యంతో అల్లు అరవింద్ తీసుకు వచ్చిన ఓటీటీ ఆహా.

ఈ ఓటీటీ అతి తక్కువ సమయంలోనే సూపర్‌ సక్సెస్ అయ్యింది.ఈ ఓటీటీ ప్రారంభం అయ్యి అధికారికంగా ఏడాది ఇటీవలే పూర్తి అయ్యింది.

ఈ ఏడాది కాలంలో సగంకు పైగా కరోనా కారణంగా లాక్ డౌన్‌ విధించారు.ఆ సమయంలో ఆహా నుండి ఎలాంటి సినిమా లు వెబ్‌ సిరీస్ లు రాలేదు.

అయినా కూడా ఆహా కు మంచి ఆధరణ దక్కింది.ఇక ఇటీవల ఆహా మరో అరుదైన మైలు రాయిని చేరింది.

Advertisement

ఆహా యాప్ ను డౌన్‌ లోడ్‌ చేసుకున్న వారి జాబిత ఏకంగా మిలియన్ కు చేరింది.ఓటీటీ యాప్ ను మిలియన్ మంది డౌన్ లోడ్‌ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు.

తక్కువ సమయంలో ఆహా ను అత్యధికులు డౌన్‌ లోడ్‌ చేసుకోవడం ప్రస్తుతం హాట్‌ టాపిక్ గా మారింది.తెలుగు లో మాత్రమే కంటెంట్‌ ను ఇస్తున్న ఆహా అద్బుతమైన రెస్పాన్స్ ను దక్కించుకుంది.

ఇలాంటి సమయంలో ఆహా కు భారీ ఎత్తున సబ్‌ స్క్రైబర్స్ కూడా యాడ్ అవుతున్నారు.ప్రముఖ ఓటీటీ లను పక్కకు నెట్టి మరీ కొన్ని సినిమా లతో టాప్‌ రేటింగ్‌ ను దక్కించుకుంది.

అత్యధిక రన్ టైమ్‌ ను దక్కించుకోవడంతో పాటు సమంత వంటి స్టార్‌ హీరోయిన్ తో టాక్ షో ను చేయించింది.చిన్న సినిమా లను కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ సినిమా లను విడుదల చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అల్లు అరవింద్‌ తన తెలివి తేటలతో అతి తక్కువ సమయంలోనే ఆహా ను టాప్ రేంజ్ కు తీసుకు వెళ్లాడు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

తెలుగు వారి ఓటీటీ అంటూ ప్రచారం చేయడం వల్ల అద్బుతమైన రెస్పాన్స్‌ వచ్చిందని నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు