తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

1.తైవాన్ సరిహద్దుల్లో చైనా విమానాలు

చైనాకు చెందిన 30 విమానాలు తైవాన్ సరిహద్దుల్లోకి చొరబడ్డాయి.

దీంతో తైవాన్ ఆర్మీ అప్రమత్తం అయ్యింది.

2.బూర్జ ఖలీఫ్ పై మహాత్మా గాంధీ ఫోటో

భారత జాతిపిత మహాత్మా గాంధీ 152 వ జయంతిని పురస్కరించుకుని దుబాయ్ లోని ప్రముఖ బూర్జ్ ఖలీఫా భవనం పై మహాత్మా గాంధీ ఫోటో ను ఉంచారు.

3.కోర్టుకెక్కిన ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ట్విట్టర్ అకౌంట్ ను పునరుద్ధరించాలని కోర్టును ఆశ్రయించారు.

4.యూకే లో ఇంధన కొరత రంగంలోకి ఆర్మీ

తమ దేశంలో ఇంధన కొరతను తీర్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఆర్మీ ని రంగంలోకి దించింది.

5.చైనా సైన్యం లో పాక్ అధికారులు

చైనా సైన్యం లో రహస్యంగా పాక్ అధికారులను రహస్యంగా మోహరించినట్లు సమాచారం.

6.కువైట్ లో గాంధీ జయంతి

కువైట్ లో ని భారత ఎంబసీ కార్యాలయంలో భారత జాతిపిత మహాత్మా గాంధీ 152 వ జయంతి వేడుకలను నిర్వహించారు

7.కువైట్ లో భారతీయ నర్స్ మృతి

కువైట్ లో భారత్ కు చెందిన జెస్లిన్ అనే 35 ఏళ్ల నర్స్ ఓ ఆసుపత్రి లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.ఈమె కేరళ కు చెందిన వారు.

8.ఎన్ఆర్ ఐ యూసఫ్ ఆలీకి అరుదైన గౌరవం

కేరళకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త , లలూ గ్రూప్ అధినేత ఎన్.ఆర్.ఐ,  ఎం ఏ యూసఫ్ ఆలీ కి అరుదైన గౌరవం దక్కింది.ఒమన్ ప్రభుత్వం లాంగ్ టర్మ్ వీసా ను మంజూరు చేసింది.

9.తెలుగు నృత్య కళాకారిణి కి బ్రిటిష్ సిటిజెన్ అవార్డ్

బ్రిటన్ లో స్థిరపడ్డ హైదరాబాద్ కు చెందిన శాస్త్రీయ నృత్య కళాకారిణి రాఘ సుధ వింజుమూరికి ప్రముఖ బ్రిటిష్ సిటిజెన్ అవార్డ్ లభించింది.

10.అమెరికాలో ఏడు లక్షలు దాటిన కరోనా మరణాలు

Advertisement

అమెరికాలో కరోనా మృతుల సంఖ్య ఏడు లక్షలు దాటింది.    .

అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు...
Advertisement

తాజా వార్తలు