తెలుగు ఎన్.ఆర్.ఐ డైలీ న్యూస్ రౌండప్

1.ఎన్నారైలకు ఆధార్ కార్డ్ కష్టాలు లేనట్టే

ఎన్నారైలకు ఆధార్ కార్డు విషయంలో ఇక కష్టాలు తప్పినట్లే.

అంతకుముందు ఎన్నారైలు ఆధార్ కార్డు కోసం 180 రోజులు ఎదురు చూడాల్సి వచ్చేది.అయితే ఇప్పుడు ఎన్నారైలకు వెంటనే ఆధార్ కోసం దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది యు ఐ డి ఏ ఐ ( యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ).స్వదేశానికి వచ్చిన వెంటనే ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది.

2.వలసదారులకు కువైట్ శుభవార్త

కువైట్ లో నివసిస్తున్న వలసదారులకు అక్కడి మున్సిపల్ శాఖ శుభవార్త చెప్పిన ఈ ఏడాది ఏడారి క్యాంపింగ్ కు అనుమతిస్తున్నట్లు వెల్లడించింది.నవంబర్ 15 నుంచి క్యాంపింగ్ కు అవకాశం కల్పిస్తున్నట్లు మున్సిపల్ శాఖ పేర్కొంది.

3.వలసదారులకు కువైట్ కొత్త రూల్స్

 వలసదారులకు కువైట్ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది.కువైట్ కు వచ్చే జీసీసీ  పౌరులతో పాటు , ఇతర దేశాలకు చెందిన ప్రయాణికులు తప్పనిసరిగా ఆయా దేశాల్లో జారీ చేసిన కరోనా వ్యాక్సిన్ సర్టిఫికేట్ అప్డేట్ చేసుకోవాలని ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది.

4.మిషన్ ఆఫ్గాన్ కొనసాగుతోంది

కాబూల్ విమానాశ్రయంలో బాంబు పేలుళ్ల ఘటనను తీవ్రంగా పరిగణిస్తామని అమెరికా అధ్యక్షుడు బైడన్ స్పష్టం చేశారు.ఆఫ్గాన్ లో ఉన్న తమ దేశాల తో పాటు ఇతర దేశాలకు చెందిన ప్రజలను అక్కడి నుంచి తరలించే వరకు తమ మిషన్ కొనసాగుతుందని తెలిపారు.

5.కరోనా సోకిన వారికి కొత్త ముప్పు

కరోనా టీకా తీసుకున్న వారి లో కంటే కరోనా సోకిన వారిలో రక్తం గడ్డ కట్టే ముప్పు ఎక్కువ ఉందని బ్రిటిష్ మెడికల్ జర్నల్ లో పబ్లిష్ చేశారు.

6.ఆఫ్ఘన్ లను చంపడం అపండి

ఆఫ్ఘన్ లో పేలుళ్లపై ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.ట్విట్టర్ వేదికగా మరోసారి రక్త సిద్ధమైందని, తమ దేశాన్ని కాపాడాలని, ఆఫ్గాన్ లో నర వరకు పులి స్టాప్ పెట్టాలని కోరారు.

7.కాబూల్ విమానాశ్రయంలో పేలుళ్లు : 150 మంది మృతి

కాబుల్ విమానాశ్రయం లో ఐసీస్ ఉగ్ర వాదులు ఆత్మాహుతికి పాల్పడిన ఘటనలో 103 మంది అఫ్గాన్ లు, 13 మంది అమెరికన్ సైనికులు మృతి చెందారు.

8.అమెరికా హెచ్చరిక

అమెరికాతో పాటు అనేక అగ్రరాజ్యాలు కాబూల్  ఎయిర్ పోర్ట్ వద్ద  ఉగ్ర దాడులు, రాకెట్ల దాడి జరిగే అవకాశం ఉన్నట్టు హెచ్చరికలు చేశాయి.

9.ఆస్ట్రేలియాలో కరోనా బీభత్సం

ఆస్ట్రేలియాలో రెండో దశ తీవ్రరూపం దాల్చుతోంది.నెలల తరబడి దేశంలో లాక్ డౌన్ విధించినప్పటికీ , కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి.

10.  ఇండో అమెరికన్ బాలికకు అవార్డు

ఇండో అమెరికన్ బాలికకు ప్రతిష్టాత్మక స్టాక్ హోం జూనియర్ వాటర్ ప్రైస్ వరించింది నీటిని నిర్విషీకరణ చేసే పరిశోధనకు గాను ఇండియన్ అమెరికన్ బాలిక ఇషానీ జాకు ఈ అవార్డు దక్కింది.

బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ.. మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు

తాజా వార్తలు