తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ -Telugu NRI America News

1.ఆటిజం పై నాట్స్ వెబినార్ కు విశేష స్పందన

అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ఆటిజం పై వెబినార్ నిర్వహించింది.

దీనికి విశేష స్పందన లభించింది.

2.శ్రీలంకలో ఎన్నికలకు మాజీ అధ్యక్షుడి పిలుపు

శ్రీలంక  ప్రీడం పార్టీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సంచలన వ్యాఖ్యలు చేశారు.దేశంలో కొత్తగా ఎన్నికలు జరపాలని , ఎన్నికలే సమస్యలకు పరిష్కారం చూపుతాయని ఆయన వ్యాఖ్యానించారు.

3.జర్మనీకి మోదీ .ధ్వైపాక్షిక అంశాలపై చర్చలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీ పర్యటనలో ఉన్నారు.మూడు రోజుల పాటు ఐరోపాలో ఆయన పర్యటించనున్నారు.ఈ సందర్భంగా ధ్వైపాక్షిక అంశాలపై చర్చలుజరపనున్నారు.

4.చైనాలో కరోనా ఉధృతి.

నిబంధనలు కఠినతరం

చైనాలో రోజురోజుకీ కరోనా వైరస్ ఉధృతి తీవ్రతరం అవుతోంది.దీంతో కరోనా పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్ కి తరలిస్తున్నారు.నెగిటివ్ వచ్చిన వారినీ క్వారంటైన్ కి తరలించడం వివాదాస్పదం అవుతోంది.

5.ఉక్రెయిన్ యుద్ధం :

రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో 55 లక్షల మంది శరణార్థులు గా మారారని ఇరాసా శరణార్థుల విభాగం యూఎస్ హెచ్ ఆర్సీ పేర్కొంది

6.ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక ప్రకటన

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక ప్రకటన చేశారు.రష్యన్ ఎదుర్కొనే క్రమంలో ఆస్ట్రేలియా  చేస్తున్న సహాయం ఉక్రెయిన్ చరిత్రలో నిలిచి పోతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రకటించారు.

7.ఉక్రెయిన్ సరిహద్దులకు అమెరికా ప్రథమ మహిళ

Advertisement

ఉక్రెయిన్ దేశ సరిహద్దు ప్రాంతానికి అమెరికా అధ్యక్షుడు జో బైడన్ భార్య త్వరలోనే వెళ్లనున్నారు.

8.డెన్మార్క్ ప్రధాని నివాసంలో మోదీ చర్చలు

డెన్మార్క్ ప్రధాని డానిష్ పీఎం మెట్ ఫెడరిక్ సన్ నివాసంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరిపారు.దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు