తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

1.ఫిలడెల్ఫియా లో నాట్స్ దాతృత్వం

  ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోంది దీనిలో భాగంగానే ఫిలడెల్ఫియా చాప్టర్ నాట్స్ విభాగం పేదల ఆకలి తీర్చేందుకు ముందడుగు వేసింది.

ఫిలడెల్ఫియా లో లార్డ్స్ ప్యాంట్రి డౌనింగ్ కు 6,282 డాలర్లను విరాళంగా ప్రకటించింది. 

2.అరిజోనా రాష్ట్రంలో ATA ఫినిక్స్ టీమ్ ప్రారంభం

 

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) వారు నూతనంగా అరిజోనా రాష్ట్రంలో ఫినిక్స్ టీమ్ ను ప్రారంభించారు. 

3.సౌదీ అరేబియాలో కొత్త వీసా పథకం ప్రారంభం

     

సౌదీ అరేబియా లో గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ నివాసితుల కోసం  కొత్త వీసా పథకం ప్రారంభిస్తున్నట్లు .ఆ దేశ పర్యాటక శాఖ మంత్రి అహ్మద్ అల్ ఖతీబ్ వెల్లడించారు. 

4.మరో భారతీయ అమెరికన్ మహిళకు బైడన్ కీలక బాధ్యతలు

 

Advertisement

అమెరికా అధ్యక్షుడు జో బైడన్ తన టీంలో మరో భారతీయ మహిళలకు కీలక బాధ్యతలు అప్పగించారు.ఇండో అమెరికన్ సోపెన్ బీషా ను వెస్ట్రన్ డ్రిస్టిక్ ఆఫ్ విస్కాన్సికి యూఎస్ స్టేట్ అటార్నీ గా అమెరికా అధ్యక్షుడు నామినేట్ చేశారు. 

5.క్షీణించిన ముషారఫ్ ఆరోగ్యం

  పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి పర్వేజ్ ముషారఫ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్స్ పై చికిత్స జరుగుతోంది. 

6.ఉక్రెయిన్ కు బ్రిటన్ వార్నింగ్

  రష్యా తు యుద్ధం కారణంగా ఉక్రెయిన్ తీవ్ర నష్టాన్ని చవిచూసింది.ఈ నేపథ్యంలో లో కలరా ప్రబలే అవకాశం ఉందని బ్రిటన్  హెచ్చరించింది. 

7.ఆఫ్ఘాన్ నుంచి ఇండియాకు విమాన సర్వీసులు

 

తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్లో అధికారం చేజిక్కించుకున్న తర్వాత రెండు దేశాల మధ్య విమాన సర్వీసులు నిలిచిపోయాయి.తాజాగా ఆ విమాన సర్వీసులను యధావిధిగా నడపనున్నట్లు ఆఫ్ఘన్ ప్రభుత్వం ప్రకటించింది. 

8.భారత్ బంగ్లాదేశ్ల మధ్య బస్సు సర్వీసులు పునః ప్రారంభం

 భారత్ బంగ్లాదేశ్ ల మధ్య నిలిచిపోయిన పోయిన బస్సు సర్వీసులను పునః ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు