తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ 

1.బే ఏరియా లో ఎన్టీఆర్ జయంతి .మిని మహానాడు

 అమెరికాలోని తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి జయరామ్ కోమటి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

అలాగే మినీ మహానాడు ను సైతం నిర్వహించబోతున్నారు. 

2.నాట్స్ అధ్యక్షుడు దాతృత్వం

 

అమెరికాలోని అతి పెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం ( నాట్స్ ) అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన బాపు నూతి తాజాగా ఏపీలోని గుంటూరు జిల్లా పెద నందిపాడు లో మెగా ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయించి వేల మంది పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు చేయించారు. 

3.తానా ఫౌండేషన్ చేయూత స్కాలర్ షిప్స్ పంపిణీ

 ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా ) అమెరికాలోని తెలుగు ప్రజలకు అండగా ఉంటూ అనేక కార్యక్రమాలు చేపడుతోంది.

దీనిలో భాగంగానే తానా చేయూత ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తోంది.దీనిలో భాగంగానే తాజాగా ప్రకాశం జిల్లా లోని సీఎస్ పురం గ్రామానికి చెందిన 30 మంది పేద విద్యార్థులకు తానా ఫౌండేషన్ స్కాలర్షిప్ లు అందించారు. 

4.న్యూయార్క్ లో హెల్త్ ఎమర్జెన్సీ

 

మంకీ పాక్స్ వ్యాప్తి నేపథ్యంలో ఆర్థిక రాజధాని న్యూయార్క్ లో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని విధించారు. 

5.యూరప్ దేశాలపై పుతిన్ ప్రతీకారం

  ఉక్రెయిన్ తో యుద్ధం సమయంలో తమకు వ్యతిరేకంగా వ్యవహరించిన యూరప్ దేశాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతీకార చర్యలకు దిగారు.తాజాగా యూరప్ దేశాలకు గ్యాస్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. 

6.మరోసారి అమెరికా అధ్యక్షుడికి కరోనా పాజిటివ్

 

Advertisement

అమెరికా అధ్యక్షుడు జో బైడన్ కు మరోసారి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 

7.కాలిఫోర్నియా లో కార్చిచ్చు

  కాలిఫోర్నియా లో కార్చిచ్చు చోటు చేసుకుంది.

దాదాపు 20 వేల హెక్టార్ల లో అడవి దగ్ధం అయ్యింది.ఈ కార్చిచ్చు ను ఆర్పేందుకు వందలమంది అగ్నిమాపక సిబ్బంది కష్టపడుతున్నారు. 

8.భూ కక్ష్యలో కి చైనా రాకెట్ శిథిలాలు

 

హిందూ మహా సముద్రం మీద భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించిన చైనా రాకెట్ శిథిలాలు మండిపోతూ కిందపడిన ఘటన చోటు చేసుకుంది.దీనిని అమెరికా స్పేస్ సెంటర్ కూడా ధృవీకరించింది. 

9.బిన్ లాడెన్ కుటుంబం విరాళం

  ప్రిన్స్ చార్లెస్ ట్రస్ట్ కు ఒసామా బిన్ లాడెన్ కుటుంబం పది లక్షల పౌండ్ల విరాళం అందించింది. 

10.ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు కన్నుమూత

 

ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామోస్ (94) కన్నుమూశారు.         .

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు