తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

1.చికాగో లో బతుకమ్మ సంబరాలు

అమెరికన్ తెలుగు అసోసియేషన్ చికాగో టీమ్ నిర్వహించిన దసరా బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి.

ఇల్లినాయిస్ 11 వ డిస్ట్రిక్ట్  కాంగ్రెస్ మాన్ బిల్ పాస్టర్ ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో 350 మందికి పైగా తెలుగు వారు పాల్గొన్నారు. 

2.ముగిసిన తానా SAT శిక్షణ తరగతులు

  ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా ) ప్రతిష్టాత్మకంగా, వినూత్నంగా భావితర విద్యార్థిని విద్యార్థులకు ఉపయోగపడే శిక్షణ తరగతులను దిగ్విజయంగా పూర్తి చేసింది. 

3.మరో ఇండియన్ అమెరికన్ కు కీలక పదవి

  అమెరికా అధ్యక్షుడు పరిపాలనలో భారతీయ మూలాలు ఉన్న వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.తాజాగా అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయమైన పెంటగాన్ లో ఓ కీలక పదవికి భారత సంతతి వ్యక్తి పేరును అధ్యక్షుడు ప్రతిపాదించారు. 

4.అమెరికా మాజీ అధ్యక్షుడు కి తీవ్ర అస్వస్థత

  అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.దీంతో ఆయనను  దక్షిణ కాలిఫోర్నియా ఆసుపత్రిలో చేర్పించారు రక్తసంబంధం ఇన్ఫెక్షన్ తో ఆయన బాధపడుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 

5.తానా ఆధ్వర్యంలో పుస్తక మహోద్యమం

  ప్రజల్లో పుస్తకాల పై ఆసక్తి పెంచేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా ) ముందుకు వచ్చింది. పుస్తక మహోధ్యమం పేరిట పాఠనాశక్తి పెంపొందించేందుకు తానా ప్రపంచ సాహిత్య వేదిక ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది దసరా నుంచి సంక్రాంతి వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తానా ఏర్పాట్లు చేసింది. 

6.బంగ్లాదేశ్ లో ఇద్దరు హిందువుల హత్య

  భారత్ పొరుగుదేశమైన బంగ్లాదేశ్ లో ఇద్దరు హిందువులు దారుణ హత్యకు గురయ్యారు.అలాగే ఆ దేశంలోని హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. 

7.న్యూజెర్సీలో దసరా ఉత్సవాలు

  న్యూజెర్సీలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ ఉత్సవాల్లో న్యూయార్క్ న్యూజెర్సీ, డెలావేర్, పెన్సిల్వేనియా  తదితర ప్రాంతాల్లో నివాసముంటున్న తెలుగు వారితో పాటు ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 

8.చైనాలో ఖురాన్ యాప్ తొలగించిన యాపిల్

Advertisement

  చైనా అధికారులు అభ్యర్థన మేరకు ఖురాన్ యాప్ను యాపిల్ సంస్థ తమ మొబైల్ స్టోర్ నుంచి తొలగించింది. 

9.బ్రిటన్ ఎంపీ దారుణ హత్య

  బ్రిటన్ ఎంపీ దారుణ హత్యకు గురయ్యారు.ఎసెక్స్ లోని సౌత్ ఆన్ వెస్ట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ డేవిడ్ అమీస్ ను ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడు. 

10.భారత్ పై ఐఎంఎఫ్ ప్రశంసలు

  అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ( ఐఎంఎఫ్ ) కరోనా సమయంలో భారత ప్రభుత్వం వేగంగా చెప్పుకో తగిన రీతిలో స్పందించిందని ప్రశంసించింది.   .

Advertisement

తాజా వార్తలు