తెలుగు ఎన్.ఆర్. ఐ  డైలీ న్యూస్ రౌండప్

1.ఆస్ట్రేలియాలో భారత విద్యార్థుల ఇబ్బందులపై చర్చ

ఆస్ట్రేలియాలో భారత విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆస్ట్రేలియా రక్షణ మంత్రి పీటర్ డుటన్ తో చర్చించినట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ తెలిపారు.

 

2.ఆర్థిక సంక్షోభంలో లెబనాన్

  పశ్చిమ ఆసియా దేశమైన లెబనాన్ లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొంది. 

3.ఫేస్ బుక్ అధినేత పై ట్రంప్ విమర్శలు

  అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ సోషల్ మీడియా వివాదం కొనసాగుతూనే ఉంది.

తాజాగా ఫేస్ బుక్ అధినేత జూకర్ బర్గ్ పై ట్రంప్ విమర్శలు చేశారు.తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జూకర్ బర్గ్ ఫేస్ బుక్ అధినేతను అంటూ భార్యతో సహా వచ్చేవాడిని వ్యాఖ్యానించారు.

Advertisement

వ్యాపారాల కోసం ఎంతవరకైనా వెళ్లేవారని వెటకారం చేశారు.వైట్ హౌస్ చుట్టూ పదేపదే తిరిగిన జూకర్ బర్గ్ వంటి దిగ్గజాలు చాలామంది ఇప్పుడు చేతగాని దద్దమ్మల్లా మిగిలిపోయారు అంటూ విమర్శలు చేశారు. 

4.ఇరాక్ లో బాంబు దాడులు

  ఇరాక్లో మరోసారి బాంబు లు మార్మోగాయి.ఎయిర్ బిల్ అంతర్జాతీయ విమానాశ్రయం పై రెండు డ్రోన్లతో దాడి జరిగింది.ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. 

5.అమెరికా జూ లో గొరిల్లా కు కరోనా

  ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికాలో మనుషుల నుంచి గొర్రెలకు కరోనా వైరస్ సోకింది.అట్లాంటా జూ లో పలు గొరిల్లాలు కరోనా వైరస్ ప్రభావానికి గురి అయ్యాయి. 

6.భారత్ సమీపంలోని మూడు దీవులు చైనాకు అప్పగింత

  భారత్ సమీపంలోని శ్రీలంకకు చెందిన మూడు దేవుళ్లను చైనాకు అప్పగించినట్లు ఆ దేశ ఎంపీ రాధాకృష్ణ తెలిపారు. 

7.ప్రపంచంలో అతిపెద్ద సైన్యాల జాబితా విడుదల

  జర్మనీకి చెందిన ఓ ప్రముఖ కంపెనీ సైన్యం పరిణామం పరంగా మొదటి పది దేశాల జాబితాను విడుదల చేసింది.ఈ జాబితాలో మొదటి స్థానంలో చైనా ఉండగా రెండో స్థానంలో భారత్ ఉంది. 

8.అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అగ్నిప్రమాదం

  అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.ఈ ఘటన స్పేస్ స్టేషన్ లో ఉన్న రష్యా మాడ్యూల్ లో జరిగింది.మోక్ అలారం మోగడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోకుండా అందరూ బయటపడ్డారు. 

9.కువైట్ లో ఎంపీ మిథున్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

  వైసిపి సీనియర్ నేత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కువైట్ లో మిథున్ రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో కువైట్ ,ఆంధ్రప్రదేశ్ లో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. 

10.ఇంగ్లాండ్ నుంచి యూఏఈ చేరుకున్న భారత్ క్రికెట్ టీమ్

  యూఏఈ లో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ ల కోసం టీమిండియా ఇంగ్లాండ్ చేరుకుంది.

Advertisement

ఇంగ్లాండ్ సిరీస్ అనుకోకుండా  వాయిదా పడడంతో ఆరు రోజుల క్వారంటైన్ తరువాత టీమ్ ఇండియా క్రికెటర్లు యూఏఈ బయల్దేరారు.

తాజా వార్తలు