తెలుగమ్మాయిలకి అవకాశాలు రావాలంటే తెల్ల తోలుతో పాటూ, ఎక్స్ పోజింగ్ కూడా చెయ్యాలి...

తెలుగులో ఒకప్పుడు కింగ్ నాగార్జున తో శివ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తీసి టాలీవుడ్ సినిమా పరిశ్రమలోనే టాప్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న "రామ్ గోపాల్ వర్మ" గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 అయితే ఆ మధ్య  కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూత పడటంతో ఆన్ లైన్ ద్వారా కూడా చిత్రాలను విడుదల చేసి మరో కొత్త ప్రయత్నానికి నాంది పలికాడు.

కాగా ఈ మధ్య రామ్ గోపాల్ వర్మ యూట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలలో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తలలో నిలుస్తున్నాడు.కాగా తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్జీవి సినిమా పరిశ్రమలో "తెలుగు అమ్మాయిలకి అవకాశాలు ఎందుకు రావనే" విషయంపై పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు.

అయితే ఇందులో భాగంగా ఎక్కువగా టాలీవుడ్ సినీ ప్రేక్షకులు అందం, అభినయంతో పాటు తెలుపు రంగులో ఉన్న హీరోయిన్లను బాగా ఇష్ట పడతారని దీంతో పాటు ఎక్స్ పోజింగ్ చేసే హీరోయిన్లను కూడా బాగానే ఇష్ట పడతారని అందువల్లనే దర్శకనిర్మాతలు ఎక్కువగా ముంబై హీరోయిన్లను తీసుకురావడం వంటివి చేస్తుంటారని చెప్పుకొచ్చాడు.అంతేగాక తెలుగు హీరోయిన్లకు కూడా బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉందని కానీ ఇక్కడి నుంచి బాలీవుడ్ సినిమా పరిశ్రమకు వెళ్లేటువంటి హీరోయిన్లు చాలా తక్కువగా ఉంటారని, కానీ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఎంతో మంది హీరోయిన్లు క్రేజ్ కోసం వస్తుంటారని తెలిపాడు.

ఇందులో ముఖ్యంగా మరికొంతమంది హీరోయిన్లు అయితే పారితోషికం విషయం గురించి కూడా ఆలోచించి టాలీవుడ్ సినిమా పరిశ్రమకి వస్తుంటారని కూడా తెలిపాడు.దీంతో తెలుగమ్మాయిల సినీ అవకాశాలపై "రామ్ గోపాల్ వర్మ" చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

Advertisement

దీంతో కొందరు నెటిజనులు ఈ విషయంపై స్పందిస్తూ "పొరుగింటి పుల్ల కూర ఎప్పుడు రుచిగానే ఉంటుందని ఇంట్లో ఉన్న కూరలు నచ్చవని" అంటూ కామెంట్లు చేస్తున్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన "మర్డర్" అనే చిత్రాన్ని "అమెజాన్ ప్రైమ్ వీడియోస్" లో విడుదల చేశాడు.

 కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.కాగా  ప్రస్తుతం ఆర్జీవీ "డీ కంపెనీ" అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు.అంతేగాక ఈ నెల 23వ తారీఖున ట్రైలర్ ని విడుదల చేస్తామని కూడా ప్రకటించాడు.

 కాగా ఈ చిత్రం మాఫియా డాన్ "దావూద్ ఇబ్రహీం" జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం.దాంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు