తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్ 4, శుక్రవారం 2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.08

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.04

రాహుకాలం: ఉ.10.30 ల12.00

అమృత ఘడియలు: ఉ.8.33 ల10.32

Advertisement
Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu 04 October 2024 , 04 Frid

దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12 మ12.28 ల1.12

మేషం:

Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu 04 October 2024 , 04 Frid

ఈరోజు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.మిత్రుల నుంచి రుణాల ఒత్తిడులు పెరుగుతాయి.దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి.నూతన రుణయత్నాలు సాగిస్తారు.

రక్తపు మరకల దుస్తులతోనే తండ్రికి కూతురు అంత్యక్రియలు.. వీడియో చూస్తే కన్నీళ్లాగవు..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటలు విని ఎంతో సంతోషించాను.. నాగచైతన్య కామెంట్స్ వైరల్!

వ్యాపారాలు మందగిస్తాయి.ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి.

Advertisement

వృషభం:

ఈరోజు ఆదాయ మార్గాలు పెరిగి రుణాలు తీర్చగలుగుతారు.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు.

గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధస్తారు.

మిథునం:

ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహారించాలి.కుటుంబసభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.ముఖ్యమైన పనులలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి.

దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి.వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

కర్కాటకం:

ఈరోజు కుటుంబ విషయాలలో సొంత ఆలోచనలు అమలు చేస్తారు.సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు.విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి.వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

ఉద్యోగ వాతావరణ ఉత్సాహంగా ఉంటుంది.

సింహం:

ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి.

అనుకోని ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

ఉద్యోగాలలొ అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

కన్య:

ఈరోజు చేపట్టిన పనుల్లో కొంత జాప్యం తప్పదు.ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి.వ్యాపార, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలించవు.

ఇంటా బయట యుక్తిగా వ్యవహరించడం మంచిది.ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది.

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

తుల:

ఈరోజు ప్రముఖుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు.ఆకస్మిక ధనలాభం సూచనలు ఉన్నవి.స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు.

ముఖ్యమైన వ్యవహారాలలో కార్యజయం కలుగుతుంది.వ్యాపారాలు విస్తరణకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయి.

వృశ్చికం:

ఈరోజు దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు.ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.వ్యాపారాలు పుంజుకుంటాయి.

చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుం.పలుకుబడి కలిగిన వారి పరిచయాలు పెరుగుతాయి.

ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

ధనుస్సు:

ఈరోజు ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి.ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు.స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు.ఉద్యోగాలలో అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి ఉండదు.

మకరం:

ఈరోజు కీలక వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.భూసంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి.ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.ఆశించిన ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా సమానంగా ఉంటాయి.

నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.

కుంభం:

ఈరోజు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.బంధు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి.పనులు చకచకా పూర్తి చేస్తారు.

వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

మీనం:

ఈరోజు కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.నూతన వాహనయోగం ఉన్నది వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.మొండి బకాయిలు వసూలవుతాయి.

ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడగలుగుతారు.

తాజా వార్తలు