తెలుగు బిగ్ బాస్ సీజన్ 7( Bigg Boss 7 ) గురించి ఆరంభం లో కాస్త ఎక్కువ హడావుడి చేయడం జరిగింది.బాబోయ్ మరీ అంతగా ఉంటుందా అంటూ చాలా మంది కూడా ఆసక్తిగా ఎదురు చూశారు.
కానీ అసలు విషయం ఏంటి అంటే మొత్తం షో గత సీజన్ ల మాదిరిగానే బోరింగ్ గా ఉంది.ప్రస్తుతం షో విషయం లో జనాలు మాట్లాడుకుంటున్నారు.
కానీ అది నెగటివ్ గా అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇప్పటి వరకు అయిదు వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 7 కి కొత్తగా మరో అయిదుగురు ఎంట్రీ ఇవ్వడం విశేషం.
మరీ ఇలాంటి రచ్చ ఏంట్రా బాబు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

హౌస్ లో ఉన్న 75 శాతం మంది కంటెస్టెంట్స్ ( BB7 Contestants ) ఎప్పుడు ఎలా ఉంటున్నారో అర్థం కావడం లేదు.కొత్తగా వచ్చిన వారి లో పెద్దగా గ్లో కనిపించడం లేదు.పైగా కొందరు పదే పదే ఏడ్చి చిరాకు పెడుతున్నారు.
ఇక ఇప్పటికే హౌస్ లో ఉన్న శోభ( Sobha Shetty ) నోరు నెత్తిన పెట్టుకుని ఉంది అంటూ విమర్శలు వస్తున్నాయి.శివాజీ( Sivaji ) పక్కన ఉండి పల్లవి ప్రశాంత్( Pallavi Prasanth ) గేమ్ ఆడుతున్నాడు.
మొత్తానికి హౌస్ లో ఉన్న చాలా మంది ఎందుకు ఉన్నారో అంటూ చిరాకు తెప్పించే విధంగా ఉన్నారు.అసలు మీరు అంతా ఎవర్రా అని ప్రేక్షకులు టీవీ ల ముందు కూర్చుని చిరాకు పడుతూ ఉంటారు.

ముందు ముందు అయినా గేమ్ ఆసక్తి గా ఉంటుందా అంటే కచ్చితంగా కష్టం అన్నట్లుగా నెటిజన్స్ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బిగ్ బాస్ విశ్లేషకులు, రివ్యూలు ఇచ్చే వారు ఇప్పుడు చాలా అసహనంతో, అసంతృప్తితో ఉన్నారు.కనుక ముందు ముందు కూడా షో రేటింగ్ పుంజుకుంటుంది అనే నమ్మకం లేదు అంటూ బుల్లి తెర వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రతి సారి కూడా కంటెస్టెంట్స్ విషయం లో బిగ్ బాస్ నిర్వాహకులు ఫెయిల్ అవుతున్నారు.
ఈసారి కూడా మంచి కంటెస్టెంట్స్ ని ఎంపిక చేయలేక పోవడం తో ప్రేక్షకుల అభిమానం దక్కించుకోలేక పోతున్నారు.







