తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపికలో తీవ్ర గందరగోళం నెలకొంది.మూతపడిన స్కూల్ సర్టిఫికేట్ తో మరో జిల్లాలో పలువురు అభ్యర్థులు ఉద్యోగాలు పొందారని తెలుస్తోంది.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.అయితే ఇప్పటికే కానిస్టేబుల్ ఫలితాలు విడుదల అయిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఫలితాలపై అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో పలు అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారని సమాచారం.
ఈ క్రమంలోనే అర మార్కు, ఒక్క మార్కుతో పలువురు అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోయారని తెలుస్తోంది.అభ్యర్థి స్థానికత విషయంలో అధికారులు చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.







