గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మ్యాడ్ సినిమా( Mad movie ) కు మంచి ఓపెనింగ్స్ లభించాయి.ఆ సమయం లో ఏకంగా ఆరు ఏడు సినిమా లు విడుదల అయినా కూడా చిన్న సినిమా అయిన మ్యాడ్ ను జనాలు ఎక్కువగా చూసేందుకు ఆసక్తి చూపించారు.
కనుక మ్యాడ్ సినిమా భారీ వసూళ్లు నమోదు చేసుకోబోతుంది అంటూ అంతా కూడా భావించారు.మరో జాతిరత్నాలు మూవీ అంటూ చాలా మంది బలంగా వాదించారు.
అంతే కాకుండా ఇది మరో బేబీ మూవీ రేంజ్( Baby movie ) అన్నట్లుగా కూడా ప్రచారం జరిగింది.కానీ అసలు విషయం ఏంటి అంటే ఈ సినిమా వీక్ డేస్ లో కలెక్షన్స్ మరీ వీక్ గా ఉన్నాయి.

ఇలాంటి సినిమా కు ఓ రేంజ్ లో వసూళ్లు రావాల్సి ఉంది.వంద కోట్ల వసూళ్లు అంటూ తెగ ప్రచారం చేసినా కూడా మరీ వీక్ కలెక్షన్స్ రావడం తో చాలా మంది అసహనం మరియు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.మ్యాడ్ సినిమా ను ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.కనుక ముందు ముందు ఈ సినిమా కు ఎక్కువ వసూళ్లు వస్తాయి అనే నమ్మకం లేదు అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు మరియు బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మ్యాడ్ రెండో వీకెండ్ వరకు సాధ్యం అయినన్ని ఎక్కువ వసూళ్లు సాధించి ఆ తర్వాత కనిపించకుండా పోయే అవకాశాలు ఉన్నాయి.

అంటే మొత్తంగా ఈ సినిమా రూ.30 నుంచి రూ.35 కోట్ల వరకు వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయి.ఈ మద్య కాలం లో చిన్న హీరో ల సినిమా లు ఈ స్థాయి లో వసూళ్లు సాధించడం అంటే గొప్ప విషయమే.కానీ కచ్చితంగా మ్యాడ్ సినిమా కు నమోదు అవ్వబోతున్న వసూళ్లు అనేది నిరాశ కలిగించే విషయం అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







