తెలుగు బిగ్ బాస్ ఇప్పటి వరకు ఐదు రెగ్యులర్ సీజన్ లు మరియు ఒక డిజిటల్ సీజన్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.మరో రెండు మూడు రోజుల్లో తెలుగు బిగ్ బాస్ రెగ్యులర్ సీజన్ 6 ప్రారంభం కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే.
గత రెండు మూడు సీజన్లుగా బిగ్ బాస్ సోమవారం ఎపిసోడ్లో ఎవరు ఎలిమినేషన్ కి నామినేషన్ అవ్వబోతున్నారు, అలాగే శని, ఆదివారం ఎపిసోడ్లో ఏం జరుగుతుంది.ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే విషయాలు ముందుగానే లీక్ అవుతున్నాయి.
కానీ ఈ సారి అలా కాకుండా చూస్తామంటూ స్టార్ మా ఛానల్ యాజమాన్యం మరియు షో యొక్క నిర్వాహకులు బలంగా భావించి ప్రకటించారు.
వారు కోరుకున్నట్లుగానే కార్యక్రమం యొక్క వివరాలు చాలా గొప్పంగా ఉంటున్నాయి.
ముందు ముందు కూడా తప్పకుండా లీక్ అనేది లేకుండా ఉంటుందని తాజా ఉదంతమే సాక్ష్యంగా చెబుతున్నారు.సాధారణంగా అయితే బిగ్బాస్ ప్రారంభం కు వారం లేదా రెండు వారాల ముందు నుండే కంటెస్టెంట్లు ఎవరు అనే విషయమై ఒక క్లారిటీ వచ్చే విధంగా లీక్ లు వస్తూ ఉంటాయి.
కానీ ఈసారి మాత్రం ఇప్పటి వరకు షో లో అడుగు పెట్టబోయేది ఎవరు అనే విషయం లో క్లారిటీ లేదు.

ఆ విషయమై గతం లో లీక్ చేసిన వారు ఎవరు కూడా ఇప్పుడు లీక్ చేసే పరిస్థితి కనిపించడం లేదు.అది ఎందుకు అనేది అందరికీ తెలిసిందే.షో నిర్వాహకులు చాలా కట్టు దిట్టమైన చర్యలు తీసుకోవడం వల్ల గతంలో మాదిరిగా లీక్ చేయడానికి అవకాశం దొరకడం లేదు.
అంతే కాకుండా లీక్ జరిగితే కార్యక్రమం యొక్క ఇమేజ్ దెబ్బ తినడంతో పాటు రేటింగ్ కూడా తగ్గుతుంది అనే ఉద్దేశం తో కార్యక్రమం నిర్వాహకులు షో యొక్క లీక్ వ్యవహారం కి చెక్ పెట్టారు అని తాజా సమాచారం.ముందు ముందు ఎలా ఉంటుంది అనేది చూడాలి.
సెప్టెంబర్ 4వ తారీఖు నుండి బిగ్ బాస్ తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం మొదలు పెట్టనున్నాడు.







