ఆ మూడు సినిమాలు పూర్తయ్యాకే బింబిసార2.. కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ కు షాకేనా?

బింబిసార సినిమాతో కళ్యాణ్ రామ్ కోరుకున్న బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఆయన ఖాతాలో చేరిందనే సంగతి తెలిసిందే.మల్లిడి వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

 Huge Shock To Kalyan Ram Fans Details Here Goes Viral , 50 Crore Rupees, Devil-TeluguStop.com

ఫుల్ రన్ లో ఈ సినిమా 40 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లకు పరిమితమయ్యే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది.అయితే బింబిసార2 సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి మాత్రం చాలా సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి.

ఇందుకు కారణం ఇప్పటికే కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్ట్ లు అని తెలుస్తోంది.మరోవైపు బింబిసార2 స్క్రిప్ట్ పనులు పూర్తి కావడానికి చాలా సమయం పడుతుందని సమాచారం అందుతోంది.

అభిషేక్ నామా బ్యానర్ లో డెవిల్ సినిమాలో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక సినిమా, దిల్ రాజు బ్యానర్ లో ఒక సినిమాలో కళ్యాణ్ రామ్ నటించాల్సి ఉంది.ఈ మూడు ఈ ప్రాజెక్ట్ లు పూర్తి కావడానికి చాలా సమయం పట్టే ఛాన్స్ అయితే ఉంది.

ఈ సినిమాలు పూర్తైన తర్వాతే బింబిసార2 తెరకెక్కే ఛాన్స్ అయితే ఉంది.బింబిసార2 సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లినా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతాయే తప్ప తగ్గవనే సంగతి తెలిసిందే.మరోవైపు ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ సినిమాకు కళ్యాణ్ రామ్ ఒక నిర్మాతగా ఉన్నారు.ఈ సినిమాకు సంబంధించిన వ్యవహారాలను కళ్యాణ్ రామ్ దగ్గరుండి చూసుకోవాల్సి ఉంటుందనే సంగతి తెలిసిందే.

Telugu Crore Rupees, Bimbisara, Devil, Kalyan Ram-Movie

బింబిసార2 సినిమాను వెంటనే చూడాలని భావించే ప్రేక్షకులకు ఇది షాకేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బింబిసార2 సినిమా 50 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కనుందని తెలుస్తోంది.ఈ సినిమాలో ప్రేక్షకులకు నచ్చే ఎన్నో ప్రత్యేకతలు ఉండనున్నాయని సమాచారం.సినిమాసినిమాకు కళ్యాణ్ రామ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube