బిగ్ బాస్ సీజన్‌ 5 ఫినాలే ఎపిసోడ్‌ కు ముహూర్తం ఖరారు

తెలుగు బిగ్ బాస్ సీజన్‌ 5 ముగింపు దశకు వచ్చింది.ఇంటి సభ్యులు ఒక్కొక్కరిగా ఇప్పటికే సగం మందికి ఎక్కువ ఎలిమినేట్ అయ్యారు.

ప్రస్తుతం ఉన్న వారిలో ఒకరు నేడు ఎలిమినేట్ అవ్వబోతున్నారు.మిగిలి ఉన్న వారిలో నుండి ఫినాలేకు అయిదుగురు వెళ్లబోతున్నారు.

ఈ సీజన్‌ ముగింపు ఎపిసోడ్‌ డేట్ వచ్చేసింది.స్టార్‌ మా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సీజన్ ను డిసెంబర్‌ 19న ముగించబోతున్నారు.

గత సీజన్ లకు ఫినాలే ఎపిసోడ్‌ ఏ రేంజ్ లో అయితే నిర్వహించారో ఈసారి కూడా అలాగే భారీ ఎత్తున నిర్వహించేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు.గత రెండు సీజన్ లకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు అయ్యాడు.

మరి ఈ సీజన్ కు ఎవరు రాబోతున్నారు అనేది ఆసక్తిగా ఉంది.బిగ్ బాస్ సీజన్ 5 ఫినాలే ఎపిసోడ్‌ తేదీ ఫిక్స్ అయిన నేపథ్యంలో గెస్ట్‌ గురించిన విషయమై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

పెద్ద మొత్తంలో ఈ సారి రేటింగ్ వస్తుందని ఆశించినా కూడా రాలేదు.అందుకే కనీసం ఫినాలే ఎపిసోడ్‌ తో అయినా కొద్దిలో కొద్దిగా నష్టంను నివారించుకోవాలని భావిస్తున్నారు.

అందుకే అయిదు గంటల పాటు ఏకధాటిగా బిగ్ బాస్ సీజన్ 5 ఫినాలే ఎపిసోడ్‌ రాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

మెగాస్టార్‌ చిరంజీవి కాకుండా మరే స్టార్‌ తో అయినా అవకాశం ఉందా అంటూ నిర్వాహకులు ప్లాన్‌ చేస్తున్నారు.చిరంజీవి వస్తేనే ఫినాలే ఎపిసోడ్ కు కళ వస్తుంది.అందుకే ఈ సీజన్ కు కూడా ఆయనే రాబోతున్నట్లుగా చెబుతున్నారు.

ఆయనే రావాలని బిగ్‌ బాస్‌ ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు.ఫినాలే ఎపిసోడ్ వరకు సన్నీ.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

షన్నూ.రవి.మానస్ మరియు శ్రీరామ చంద్రలు ఉంటారని ప్రేక్షకులు బలంగా నమ్ముతున్నారు.సిరి కూడా ఈ జాబితాలో ఉంటుందని కొందరు అంటున్నారు.

మొత్తానికి ప్రస్తుతం ఉన్న వారు అంతా కూడా చాలా స్ట్రాంగ్.కనుక వీరిలో ఎవరైనా ట్రోఫీ దక్కించుకునే అవకాశం ఉంది.

తాజా వార్తలు