తెలుగువారిని ఆదుకుందాం...నాట్స్ పిలుపు.

తితలీ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమైన సంగతి అందరికి తెలిసిందే అయితే ఈ తుఫాన్ భాదితులని ఆడుకోవడానికి ఎంతో మంది రాష్ట్ర ప్రజలు సినిమా నటులు.

అలాగే పారిశ్రామికవేత్తలు వారికి తోచిన సాయాన్ని అందిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఏపీలో ఎలాంటి ఉపద్రవాలు జరిగినా సరే మేమున్నామంటూ అమెరికాలు ఉంటున్న తెలుగు ప్రజలు.తెలుగు సంఘాలు తమ తమ శక్తి మేరకు సాయమందిస్తూనే ఉంటాయి.

ఈ క్రమంలోనే సేవా కార్యక్రమాలలో ముందుండే నాట్స్ ఒకడుగు ముందుకు వేసింది.తెలుగు ప్రజలకి మేమున్నామని తమ ఆపన్న హస్తం అందించడాని సిద్దమయ్యింది.గతంలో కూడా హుదూ‌ద్ తుఫాన్ సమయంలో విశాఖ కోసం నాట్స్ తన వంతు సాయం చేసింది.

విశాఖ పచ్చదనం పునరుద్ధరణలో భాగంగా.మొక్కలు నాటడం, ట్రీ గార్డులు ఏర్పాటు చేయడంలో నాట్స్ ఆర్థిక సాయం చేసింది.

Advertisement

ప్రస్తుతం తితలీ బాధితులను కూడా ఆదుకోవాలని నాట్స్ శరవేగంగా స్పందిస్తోంది.

అందుకోసం నాట్స్ చాప్టర్లతో సంప్రదించి విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తోంది.తెలుగు వారిని ఆడుకుందాం అనే పులుపుతో తితలీ ప్రభావిత ప్రాంతాల్లో నాట్స్ సేవా కార్యక్రమాలను ముమ్మరం చేసింది .నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస మంచికలపూడి పలాస, సోంపేట ప్రాంతాలకు 50 మందికిపైగా నాట్స్ వాలంటీర్లను పంపించారు.భాదితులకి కనీస అవసరాలని అందిస్తోంది నాట్స్.

సాయం చేయాలనీ అనుకునే వారు ఈ క్రింది వెబ్‌సైట్ ద్వారా తమ విరాళాలు పంపాలని ఆయన ఒక పకటనలో తెలిపారు.

పాకిస్థానీ మహిళను ఉద్యోగం నుంచి తీసేసిన టెస్లా.. ఆ షాక్‌తో..??
Advertisement

తాజా వార్తలు