దాని కోసం  ఆ హీరో కుటుంబ సభ్యులు శ్రీ రెడ్డి కి 6 కోట్లు ఇచ్చారంట.. కానీ..

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు మరియు క్యాస్టింగ్ కౌచ్ సమస్య పై పోరాటం చేసి సంచలనం సృష్టించిన టాలీవుడ్ "నటి శ్రీరెడ్డి" గురించి తెలియని వారుండరు.

అప్పట్లో ఈమె పోరాటం చేసిన విషయం మంచిదే అయినప్పటికీ పలు కారణాల వల్ల తెలుగు సినిమా పరిశ్రమ బహిష్కరణకు గురైంది.

అయితే తాజాగా నటి శ్రీరెడ్డి ఇటీవలే టాలీవుడ్ ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి మరియు మిహికా బజాజ్ వివాహంపై స్పందించింది.ఇందులో భాగంగా సోషల్ మీడియా మాధ్యమాలలో ఓ వీడియోని విడుదల చేస్తూ టాలీవుడ్ సినీ పరిశ్రమలో కొందరు తాను మీ కుటుంబం నుంచి 6 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు ప్రచారాలు చేస్తున్నారని, నిజంగా తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేసింది.

 అంతేగాక నిజానిజాలు తెలుసుకోకుండా మొరిగే కొన్ని పిచ్చి కుక్కలు మాటలు తాను అస్సలు పట్టించుకోనని కొంతమేర ఘాటుగా విమర్శించింది.అంతేకాక రామా నాయుడు కుటుంబ సభ్యులలో తనకి హీరో విక్టరీ వెంకటేష్  అంటే చాలా అభిమానమని కానీ ఆయన కూడా తనకు జరిగిన అన్యాయంపై స్పందించ లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

దీంతో శ్రీ రెడ్డి రామానాయుడు కుటుంబం పై శ్రీ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.అయితే గతంలో కూడా నటి శ్రీరెడ్డి ప్రముఖ సినీ నిర్మాత సురేష్ దగ్గుబాటి కొడుకు అభిరామ్ పై కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.

Advertisement
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!

తాజా వార్తలు