టాలీవుడ్ లో తెలంగాణా ట్రెండ్..!

ప్రస్తుతం టాలీవుడ్ లో తెలంగాణా ట్రెండ్ నడుస్తుంది.అదేంటి అనుకోవచ్చు ఒకప్పుడు తెలంగాణా( Telangana ) భాషని.

యాసని కేవలం కమెడియన్స్ కి, విలన్లకు మాత్రమే పెట్టేవారు.అయితే తెలంగాణా సెపరేట్ అయ్యాక ఇక్కడ సినిమాల మీద కథల మీద ఆసక్తి పెరిగింది.

మన మేకర్స్ కూడా వాటి మీద దృష్టి పెట్టారు.కట్ చేస్తే స్టార్ హీరోల సినిమాల్లో కూడా తెలంగాణా బ్యాక్ డ్రాప్ కనిపిస్తుంది.

అప్పట్లో నారాయణమూర్తి ఎర్రసైన్యం తీశారు.ఒసేయ్ రాములమ్మా కూడా తెలంగాణా నేపథ్యంతోనే వచ్చాయి.

Advertisement

రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్( Allu arjun ) పోశించిన గోన గన్నారెడ్డి పాత్ర బాగా క్లిక్ అయ్యింది.ఇక ఇదే కోవలో సందీప్ వంగ చేసిన అర్జున్ రెడ్డిలో విజయ్ పూర్తిగా తెలంగాణా యాసలో మాట్లాడుతాడు.వీటితో పాటుగా ఫిదా, లవ్ స్టోరీ, ఫలక్ నుమా దాస్, ఇస్మార్ట్ శంకర్, జాతిరత్నాలు, డీజే టిల్లు లేటెస్ట్ గా బలగం, దసరా( DASARA ) ఇలా తెలంగాణా కథలతో తెలుగు పరిశ్రమ సూపర్ సెన్సేషన్ గా మారుతుంది.

స్టార్ హీరోలు కూడా ఈ నేపథ్యంతోనే సినిమాలు చేయాలని చూస్తున్నారు.మొత్తానికి టాలీవుడ్ లో తెలంగాణా ట్రెండ్ ఆడియన్స్ ని ఫిదా చేస్తుంది.

Advertisement

తాజా వార్తలు