ఇందిరా గాంధీకి అత్యవసర సమయంలో తెలంగాణ నే అండగా నిలబడింది: రాహుల్

తెలంగాణ ప్రజలతో తమ పార్టీ ది రాజకీయ బంధం కాదని కుటుంబ అనుబందమని , ఇందిరా గాంధీకి( Indira Gandhi ) అత్యవసర సమయం లో తెలంగాణ సమాజం అండగా నిలిచిందని ఈ విషయాన్ని తన జీవితంలో మర్చిపోలేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) పేర్కొన్నారు.

ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా నగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో జరిగిన బహిరంగసభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు.

నిజానికి ఈ సమయం లో ప్రియాంక గాంధీ( Priyanka Gandhi ) పర్యటించాల్సి ఉన్నా వ్యక్తిగత అనారోగ్య కారణాలతో ఆమె చివరి నిమిషంలో పర్యటన రద్దు చేసుకోవడంతో కాంగ్రెస్ సెంట్రల్ ఎన్నికల కమిటి సమావేశాన్ని రద్దు చేసుకొని రాహుల్ గాంధీ హాజరైనట్లుగా తెలుస్తుంది.

రాబోయే ఎన్నికలలో కేసీఆర్ కుటుంబం ఒక వైపు ఉంటే మరోవైపు మహిళలు, నిరుద్యోగులు, యావత్ తెలంగాణ సమాజం ఉందని రాహుల్ పేర్కొన్నారు.తమది దొరల పరిపాలన కాదని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలను తీసుకున్నామని, పేదలకు వందల ఎకరాల భూములు పంచామని, నాగార్జునసాగర్, శ్రీరామ్ సాగర్ ,సింగూరు ప్రాజెక్టులను నిర్మించామని కానీ కేసీఆర్ ప్రభుత్వంలో కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ ఎమ్మెల్యేలకు మాత్రమే లాభం చేకూరిందని పేర్కొన్నారు.

టిఆర్ఎస్, బిజెపి ,ఎంఐఎం( TRS, BJP, MIM ) పార్టీలు ఒక తానులో ముక్కలే అని ఆయన అభివర్ణించారు .సిబిఐ లాంటి సంస్థలతో రాజకీయ ప్రత్యర్ధులపై దాడులు చేస్తున్నారని వారికి సంబంధించిన వారిపై మాత్రం ఎటువంటి దాడులు లేవని ఆయన వ్యాఖ్యానించారు.బిజేపి కి లబ్ది చేకూర్చడం కోసమే ఎమ్ఐఎమ్ దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేస్తుందని, బిజెపికి అవసరమైనప్పుడల్లా ఆ పార్టీ అండగా ఉంటుందని పైకి మాత్రం రెండు పార్టీలు భద్ర శత్రువుల్లా వ్యవహరిస్తాయంటూ ఆయన విమర్శించారు.

Advertisement

తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలు వాస్తవరూపం దాల్చడం కోసమే సోనియా తెలంగాణ ఇచ్చారని అయితే బారతీయ రాష్ట్ర సమితి పాలన లో అవి నెరవేరలేదని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వస్తేనే ప్రజల ఆశలు నెరవేరుతాయి అంటూ ఆయన చెప్పుకొచ్చారు .

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు