పోలీసుల కళ్లు గప్పి ట్యాంక్‌బండ్‌ చేరిన ఆర్టీసీ కార్మికులు

దేశ వ్యాప్తంగా అయోధ్య చర్చ జరుగుతుంటే తెలంగాణలో మాత్రం అయోధ్య చర్చతో పాటు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించిన విషయాలు కూడా తెగ చర్చ జరుగుతున్నాయి.

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఉదృతం అయ్యింది.

నేడు ఛలో ట్యాంక్‌ బండ్‌కు ఆర్టీసీ కార్మికులు పిలుపునిచ్చారు.అయితే ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ కార్మికుల ఛలో ట్యాంక్‌ బండ్‌కు అనుమతించలేదు.

దాంతో అసలు నేడు ఎవరు కూడా ట్యాండ్‌బండ్‌ ఎక్క కూడదు అంటూ ఆదేశాలు జారీ చేసి ఆ రోడ్‌లను బ్లాక్‌ చేశారు.ట్యాంక్‌బండ్‌పై పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడంతో పాటు జిల్లాల నుండి ఆర్టీసీ కార్మికులు రాకుండా ముందస్తు అరెస్ట్‌లు చేయడంతో పాటు ఆర్టీసీ కార్మిక సంఘాల ముఖ్య నేతలను పోలీసులు ముందస్తుగానే అరెస్ట్‌ చేయడం జరిగింది.

బీజేపీ మరియు కాంగ్రెస్‌ నేతలు కూడా ఛలో ట్యాంక్‌ బండ్‌కు మద్దతుగా నిలిచిన నేపథ్యంలో పోలీసులు వారిని కూడా అరెస్ట్‌ చేయడం జరిగింది.ఇంత చేసినా కూడా దాదాపు అయిదు వందల మంది ఆర్టీసీ కార్మికులు పోలీసుల కళ్లు గప్పి దొంగ దారి ద్వారా ట్యాంక్‌బండ్‌పైకి వచ్చారు.

Advertisement

ఒక్కసారిగా అంతమంది రావడంతో పోలీసులు కూడా ఏం చేయలేక పోయారు.వారిని అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నాలు చేశారు.

భారీ ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు