తెలంగాణలో టీఆర్ఎస్ హవా! ఏపీలో జగన్ ఆశలు

తెలంగాణలో తాజాగా జరిగిన జరిగిన మున్సిపల్ ఎన్నికలలో అధికార పార్టీ టీఆర్ఎస్ ఊహించని విధంగా అద్భుతమైన ఫలితాలు సొంతం చేసుకుంది.

అసలు టీఆర్ఎస్ కి సమీపంలో అటు బీజేపీ కాని, ఇటు కాంగ్రెస్ పార్టీ కాని నిలబడలేకపోయాయి.

వందకి పైగా మున్సిపల్ స్థానాలని టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది.ఈ ఫలితాలు ఊహించినవే అయిన ఈ ఎన్నికలలో కొంత వరకైనా పుంజుకోవాలని భావించిన జాతీయ పార్టీలకి పెద్ద ఎదురుదెబ్బ తీసాయి.

ప్రజలందరూ యునానమాస్ గా టీఆర్ఎస్ పట్టం కట్టేశారు.ఇదిలా ఈ ఫలితాల నేపధ్యంలో ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ వైసీపీ కూడా కోటి ఆశలు పెట్టుకుంది.

ఇదిలా ఉంటే మరో రెండు, మూడు నెలల్లో ఏపీలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి.ఇప్పటికే ఏపీలో అధికార పార్టీ వైసీపీ అసెంబ్లీ ఎన్నికలలో ఎవరు ఊహించని ఫలితాలు సొంతం చేసుకొని తన సత్తా చాటుకుంది.

Advertisement

ఈ నేపధ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా తన ప్రతాపం చూపించాలని ప్రణాలికలు సిద్ధం చేసుకుంటుంది.అయితే గత ఏడు నెలల కాలంలో వైసీపీ పార్టీ మీద ఎన్నడూ లేని స్థాయిలో ఆరోపణలు వచ్చాయి.

ఓ విధంగా విపక్ష పార్టీలు అధికార పార్టీ వైఫల్యాలని ప్రజలల్లోకి బలంగా తీసుకెళ్ళాయి.అయితే తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు.

టీఆర్ఎస్ పార్టీని బలంగా ఎదుర్కొనే పార్టీలే లేవు.అందుకే ఇక్కడ కారు జోరు చూపించింది.

అయితే తెలంగాణలో వచ్చినట్లు ఏపీలో కూడా అధికార పార్టీకి ప్రజలు యునానమస్ గా పట్టం కడతారా అంటే సందేహమనే చెప్పాలి.స్థానిక ఎన్నికలని టీడీపీ కాని, జనసేన-బీజేపీ కాని అతన సులభంగా వదులుకుంటాయని అనుకోవడానికి అవకాశం లేదు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
ఈ దశలో గాజు గ్లాసు గుర్తు మార్చలేం తేల్చి చెప్పిన ఈసీ..!!

మరి ఈ పరిస్థితిలో ఏపీలో స్థానిక ఎన్నికలు ఎలాంటి ఫలితాలు అందిస్తాయనేది చూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు