త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో( Parliament Elections ) మెజార్టీ సీట్లు సాధించి మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్న బిజెపి, దానికి అనుగుణంగానే పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తూ అభ్యర్థులను ఫైనల్ చేస్తోంది.ముఖ్యంగా తెలంగాణలో బిజెపి పార్లమెంట్( BJP Parliament Candidates ) అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలే తీసుకుంటోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓటమి చెందడంతో ఆ ప్రభావం ఈ ఎన్నికలపై పడకుండా గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించింది.తెలంగాణ లోని పార్లమెంట్ నియోజకవర్గాలన్నిటికీ దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేశారు.
మొదటి నుంచి ఊహిస్తున్నట్లుగానే ఆదిలాబాద్ మినహా మిగిలిన స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలకే మరోసారి అవకాశం కల్పించారు అదిలాబాద్ అభ్యర్థి గా ఎవరినీ ఎంపిక చేయలేదు.అయితే మిగతా నాలుగైదు స్థానాల్లో ఒక్కో స్థానానికి ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతుండడం తో అభ్యర్థుల ఎంపిక అధిష్టానానికి కష్టంగానే మారింది.
హైదరాబాద్ మినహా అన్నిపార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసినట్టు సమాచారం.ప్రస్తుతం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం( Central Election Committee Meeting ) జరుగుతుంది.ఈ సమావేశానికి కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ హాజరయ్యారు.ఈ సమావేశం ముగిసిన అనంతరం అధికారికంగా అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు సమాచారం.
ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో కాంగ్రెస్ , బీఆర్ఎస్ లకు అవకాశం దక్కకుండా బిజెపి అభ్యర్థులు విజయం సాధించే విధంగా బిజెపి అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది.ఇదిలా ఉంటే పార్లమెంట్ నియోజకవర్గల వారిగా బిజెపి అధిష్టానం పరిశీలిస్తున్న అభ్యర్థుల జాబితా ఒకసారి పరిశీలిస్తే…
కరీంనగర్ – బండి సంజయ్( Bandi Sanjay ),నిజామాబాద్ – ధర్మపురి అరవింద్సికింద్రాబాద్ – కిషన్ రెడ్డి,మల్కాజ్ గిరి – ఈటెల రాజేందర్, మురళీధర్ రావు,మహబూబాబాద్ – హుస్సేన్ నాయక్, సీతయ్య,వరంగల్ – కృష్ణ ప్రసాద్, కళ్యాణ్,మెదక్ – రఘునందన్ రావు, అంజిరెడ్డి,జహీరాబాద్ – జైపాల్ రెడ్డి, దిల్ రాజు,మహబూబ్ నగర్ – డీకే అరుణ, జితేందర్ రెడ్డి,నాగర్ కర్నూల్ – పోతుగంటి రాములు, పోతుగంటి భరత్,భువనగిరి – బోర నరసయ్య గౌడ్, గూడూరు నారాయణ,హైదరాబాద్ – మాధవి లత
.