Viral Video : సన్నని దుంగ వంతెనపై పరుగెత్తుతున్న చిన్నారి.. వీడియో చూస్తే గుండెలదురుతాయి..!

వైరల్ అయ్యే కొన్ని వీడియోలు చూపరుల హార్ట్ బీట్ పెంచేస్తాయి.ఈ వీడియోలను చూస్తుంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో అని ప్రతి సెకన్‌ ఉత్కంఠ, భయం నెలకొంటుంది.

 Girl Running On Wooden Bridge Viral Video-TeluguStop.com

ఇలాంటి వీడియోలలో కొన్ని నిజమైనవైతే మరి కొన్ని ఫేక్ అయి ఉంటాయి.ఆ ఫేక్ వీడియోలు( Fake Videos ) కూడా చాలా రియలిస్టిక్‌గా ఉంది భయాన్ని రేపుతాయి.

అలాంటి మరొక వీడియో వైరల్ గా మారింది.ఇందులో ఓ చిన్నారి ప్రమాదకరమైన దుంగ వంతెనపై నడుస్తున్నట్లు కనిపిస్తోంది.

ఆ దుంగ వంతెన చాలా సన్నగా ఉంది.అడుగు వేరే చోట వేస్తే దాని పైనుంచి దాదాపు 20 అడుగుల లోతులో పడిపోయే ప్రమాదం ఉంది.

అందుకే వీడియో చాలా మందిని భయభ్రాంతులకు గురిచేసింది.బాలిక కిందపడి గాయపడుతుందేమో అని చాలామంది భయపడ్డారు.రెండు వైపులా లోతైన గుంతలు ఉండగా దానిపైన ఒక పెద్ద కర్ర వేశారు.ఆ కర్రపై అమ్మాయి నడుచుకుంటూ వెళుతున్నట్లు వీడియోలో కనిపించింది.ఒకవైపు లోహపు ముక్కలతో విరిగిన భవనం ఉంది.మరోవైపు చీకటిగా, మురికిగా ఉంది.

అయినా ఆ చిన్నారి ఆనందంగా ఉల్లాసంగా కర్రదుంగపై నడుస్తూ వెళ్ళిపోయింది.ఆమె గోడ మధ్యలోకి రాగానే వెనుక నుంచి ఎవరో ఆమె పేరు లులు అంటూ పిలిచారు.

ఆమె వేగంగా తిరిగింది.వీడియో అక్కడితో ముగిసిపోయింది, అమ్మాయికి ఏమైంది అని ప్రజలు ఆశ్చర్యపోయారు.

ఈ వీడియో చూసి సోషల్ మీడియాలో చాలా మంది షాక్ అయ్యారు.అయితే అది నిజం కాదని ఆ తర్వాత తెలిసింది.ఇది స్పెషల్ ఎఫెక్ట్స్, ఎడిటింగ్‌తో( Special Effects ) క్రియేట్ చేసిన ఒక వీడియో అని తెలిసింది.వీడియో చాలా బాగా క్రియేట్ చేయడం వల్ల ఇది నిజమైనదిగా అనిపించింది.వీడియోకు “3 కోట్ల వ్యూస్ ! లులూ నిర్భయమైనది, దయచేసి భయపడవద్దు, ఆమె సురక్షితంగా ఉంది, ఇది ఎడిట్ చేసిన వీడియో.” అంటూ ఒక క్యాప్షన్ కూడా జోడించారు.ఈ వీడియో ఫిబ్రవరి 11న పోస్ట్ చేయగా ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌( Instagram )లో 3.3 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి.వీడియోకు 600,000 కంటే ఎక్కువ లైక్‌లు, అనేక కామెంట్లు కూడా వచ్చాయి.

“ఏ స్పెషల్ ఎఫెక్ట్‌లతో వీడియోను రూపొందించారో చెప్పండి అంటూ ఒక వ్యక్తి కోరారు.“ఏది నిజమో ఏది నకిలీదో చెప్పడం కష్టంగా మారింది.” అని మరొకరు పేర్కొన్నారు.ఈ అద్భుతమైన వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube