టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్( Vishwak Sen ) నటించిన గామి మూవీ ఈ నెల 8వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.విశ్వక్ సేన్ గత సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.
ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ కాగా ట్రైలర్( Gaami Trailer ) కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది.ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరు కాగా విశ్వక్ మాట్లాడుతూ నా గత సినిమా విడుదలై మరికొన్ని రోజుల్లో ఏడాది అవుతోందని అన్నారు.

ఆ సమయం లోపే ఇంకో సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు.గామి సినిమా( Gaami Movie )ను మొదలుపెట్టిన సమయంలో నేనెవరో మీకు తెలియదని విశ్వక్ సేన్ కామెంట్లు చేశారు.ఈ సినిమా నా కెరీర్ తొలినాళ్లలో మొదలుపెట్టిన మూవీ అని ఆయన చెప్పుకొచ్చారు.
తక్కువ మందితో ఈ సినిమా ప్రయాణం మొదలైందని ఈ మూవీ ఔట్ పుట్ చూస్తే అద్భుతంగా ఉందని విశ్వక్ సేన్ పేర్కొన్నారు.ఈ మూవీ విషయంలో 90 శాతం కష్టం దర్శకునిది అయితే మిగతా 10 శాతం కష్టం మాత్రం టీమ్ కష్టం అని విశ్వక్ సేన్ కామెంట్లు చేశారు.
ఫలక్ నుమా దాస్ ఈవెంట్ కు రావాల్సి ఉండగా సందీప్ రెడ్డి వంగా అప్పుడు రాలేదని యాక్టింగ్ చేయకుండా హీరో అయిన వ్యక్తి ఆయన మాత్రమే అని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చారు.

డైరెక్టర్ రాజమౌళి( Director Rajamouli ) తెలుగువారంతా గర్వంగా ఫీలయ్యేలా చేస్తే సందీప్ రెడ్డి వంగా కాలర్ ఎగరేసేలా చేశాడని విశ్వక్ సేన్ అభిప్రాయపడ్డారు.గామి ట్రైలర్ గురించి వీడియో ద్వారా
స్టార్ హీరో ప్రభాస్( Prabhas )
సైతం పాజిటివ్ గా స్పందించారు.విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో కూడా నటించగా ఆ సినిమా రిలీజ్ డేట్ గురించి స్పష్టత రావాల్సి ఉంది.







