YCP Manifesto : సూపర్ సిక్స్ ను మించేలా.. వైసీపీ మేనిఫెస్టోలో వీటికే ప్రాధాన్యత

హోరాహోరీగా జరగబోతున్న ఏపీ ఎన్నికల్లో( AP Elections ) ఒక పార్టీని మించి మరో పార్టీ ఎన్నికల హామీలు ఇస్తూ, ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నాయి.వచ్చే ఎన్నికల్లో గెలవడం అన్ని పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకం కావడంతో పోటాపోటీగా మేనిఫెస్టోలను ప్రకటిస్తున్నాయి.

 Ys Jagan Adding Key Points In Ycp Manifesto-TeluguStop.com

ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్( TDP Super Six Manifesto ) పేరుతో తమ మేనిఫెస్టోను ప్రకటించగా, దానికి దీటుగా వైసిపి కొత్త మేనిఫెస్టోను రూపొందించే పనిలో నిమగ్నమైంది.ఇప్పటికే ఎనిమిది విడతలుగా వైసీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన జగన్, పూర్తిస్థాయిలో మేనిఫెస్టోను విడుదల చేసి ఇక ముమ్మరంగా ఎన్నికల ప్రచారంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు .

Telugu Ap Cm, Ap Cm Jagan, Ap, Jagan, Siddham, Tdp, Ysrcp, Ysrcp Manifesto, Yvsu

ఈ మేరకు మేనిఫెస్టో రూపకల్పనకు సీఎం క్యాంపు కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో సమావేశమై  సుదీర్ఘంగా మానిఫెస్టో రూపకల్పనపై జగన్( CM YS Jagan ) చర్చించారు.ముఖ్యంగా టిడిపి ప్రకటించిన సూపర్ సిక్స్ ను మించి ఉండేలా కొత్త మేనిఫెస్టో పై జగన్ ఫోకస్ పెట్టారు.దీనిలో భాగంగానే పార్టీ నేతలు నుంచి సలహాలు.సూచనలు తీసుకున్నారు.2019 ఎన్నికల్లో వైసీపీ( YCP ) గెలుపునకు కారణమైన నవరత్నాలపై ఫోకస్ పెడుతూనే, వాటికి మించి సరికొత్త పథకాలను మ్యానిఫెస్టోలో చేర్చేందుకు కసరత్తు చేస్తున్నారు.

Telugu Ap Cm, Ap Cm Jagan, Ap, Jagan, Siddham, Tdp, Ysrcp, Ysrcp Manifesto, Yvsu

ముఖ్యంగా యువత, రైతులు, మహిళలపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతూ మేనిఫెస్టో( YCP Manifesto )ను రూపొందిస్తున్నారు.రైతులకు రుణమాఫీతో పాటు, రైతు భరోసా పెంపు పైన కసరత్తు చేశారు.అలాగే యువత, మహిళలకు ఉపాధితో పాటు, భృతి కూడా కల్పించే విధంగా మేనిఫెస్టో ను రూపొందిస్తున్నట్లు సమాచారం.

ఈ మేనిఫెస్టోను ఎన్నికల నోటిఫికేషన్ లోపే ప్రకటించేందుకు జగన్ నిర్ణయించుకున్నారు.ఈ మేర కు వైసిపి సీనియర్ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి( MP YV Subbareddy ) ఆఖరి సిద్ధం సభలో తుది జాబితా ప్రకటిస్తామని, ఆ తరువాతే మేనిఫెస్టో విడుదల చేస్తామని ప్రకటించారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube