ఆర్టీసీ సమ్మె : సుప్రీం కోర్టుకు వెళ్లే ఆలోచనలో ప్రభుత్వం

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె నెల రోజులు దాటింది.

అటు ప్రభుత్వం ఇటు ఆర్టీసీ కార్మికులు ఏ ఒక్కరు వెనక్కు తగ్గక పోవడంతో పరిస్థితి చేతులు దాటిపోయింది.

కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది.ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కార్మికుల డిమాండ్లకు ఒప్పుకునేది లేదు అంటూ తేల్చి చెబుతుండగా, ఆర్టీసీ కార్మికులు మాత్రం ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే అంటూ డిమాండ్‌ చేస్తున్న విషయం తెల్సిందే.

ఈ నేపథ్యంలో హైకోర్టు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఏదైనా తీర్పు ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా లేదంటే అనుకూలంగా హైకోర్టులో తీర్పు వస్తే వెంటనే సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ప్రైవేటీకరణ బిల్లును ప్రధానంగా చూపిస్తూ ఆర్టీసీని ప్రైవేట్‌ పరం చేయడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ సుప్రీం కోర్టులోనే తేల్చుకోవాలంటూ ప్రభుత్వ వర్గాల వారు భావిస్తున్నారు.ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు జీతాలు లేక నానా ఇబ్బందులు పడుతున్న కారణంగా కోర్టు వారికి మద్దతుగా అనుకూలంగా తీర్పు ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Advertisement
వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..

తాజా వార్తలు