తెలంగాణ మంచినీళ్ళ పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి -జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి.

రాజన్న సిరిసిల్ల జిల్లా :రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 18 వ తేదీన నిర్వహించనున్న తెలంగాణ మంచినీళ్ళ పండుగ ( Telangana fresh water )కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( Anurag Jayanthi ) ఆదేశించారు.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఛాంబర్ లో మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా అధికారులతో సమీక్ష నిర్వహించారు.

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించనున్న మంచినీళ్ళ పండుగ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.అగ్రహారం లోని మిషన్ భగీరథ( Mission Bhagiratha ) ఫిల్టర్ బెడ్స్, ట్రీట్ మెంట్ ప్లాంట్ వద్ద కార్యక్రమం నిర్వహించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలని సూచించారు.నీటిని శుభ్రపరుస్తున్న తీరును ప్రతీ క్షేత్ర స్థాయిలో అందరికీ వివరించాలని అన్నారు.

అలాగే అన్ని గ్రామాల్లోని సమావేశాలు నిర్వహించాలని సూచించారు.ఈ సందర్భంగా తెలంగాణ మంచినీళ్ళ పండుగ కార్యక్రమంపై మిషన్ భగీరథ అధికారులు రూపొందించిన కర పత్రాలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.

Advertisement

ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఎస్ఈ రవీందర్, గ్రిడ్ ఈఈ విజయ్ కుమార్, ఇంట్రా ఈఈ జానకి,తదితరులు పాల్గొన్నారు.అనంతరం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై విజయ డైరీ వారు రూపొందించిన కర పత్రాలను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఎస్సీ కార్పోరేషన్ ఈడీ, విజయ డైరీ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు.

పుష్ప సీక్వెల్ లో శ్రీలీల లుక్ లీక్.. డ్యాన్స్ తో మరోసారి అదరగొట్టడం పక్కా!
Advertisement

Latest Rajanna Sircilla News