తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్( Congress Party ) జెండాను ఎగరవేయాలనే పట్టుదలతో ఆ పార్టీ ఉంది.గతంతో పోలిస్తే తెలంగాణ కాంగ్రెస్ క్కు మరింతగా బలం పెరిగిందని , బీ ఆర్ ఎస్, బిజెపిలోని కీలక నేతలు చేరడంతో పార్టీ మరింతగా బలోపేతం అయిందని, జనాల్లోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం పై( BRS ) తీవ్ర వ్యతిరేకత ఉందని, అలాగే కేంద్ర బిజెపి పైన( BJP ) ఉన్న ఆగ్రహం తెలంగాణ బిజెపిపై స్పష్టంగా ఉంటుందని, ఇవన్నీ తమకు కలిసి వస్తాయనే నమ్మకంతో కాంగ్రెస్ ఉంది.
అందుకే అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, వాటిని స్క్రీనింగ్ కమిటీ ద్వారా వడబోత చేపట్టారు.

దాదాపు చాలా నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక పూర్తయింది.తెలంగాణ వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సగం స్థానాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం( Central Election Commission ) ముగిసిన నేపథ్యంలో ఈరోజు ఏ సమయంలోనైనా 58 మందితో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు ఏఐసిసి వర్గాలు వెల్లడించాయి.ఇంకా కాంగ్రెస్ లోకి చేరికలు వచ్చే అవకాశం ఉండడంతో, మరికొన్ని రోజులు తర్వాత మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకుంది.

ఈనెల 18న ఆ జాబితా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏదైనా కారణాలవల్ల జాబితా విడుదల ఆలస్యమైన , అవి ఒకటి రెండు రోజుల తర్వాత విడుదలవుతుందని , ఈనెల 20 లోపు 119 మంది అభ్యర్థుల ప్రకటన పూర్తవుతుందని ఏఐసిసి వర్గాలు పేర్కొన్నాయి.అభ్యర్థుల ప్రకటన అంశంలో కీలకంగా ఉన్న స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్( Muralidharan ) క్లారిటీ ఇచ్చారు. 58 మందితో తొలి జాబితా ఆదివారం విడుదలవుతుందని స్వయంగా ఆయన ప్రకటించడంతో ఆశావాహులు జాబితా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.