నారాయణ ఖేడ్ ఎన్నికల్లో తెరాస చాలా తేలికగా గెలుస్తుంది అని సర్వే లు కూడా చెప్పాయి.అయితే భారీ మెజారిటీ రావడంతో చాలా సంతోషంగా ఉన్నారు.
మరొక పక్క కొంతమందిని కెసిఆర్ కనికరించలేదు అని పార్టీ శ్రేణులు వాపోతూ ఉండడం గమనార్హం.ఇంతకీ పార్టీ నేతల ఆవేదన అంతా…ఎప్పుడెప్పుడా అని పార్టీ నేతలు ఎదురు చూస్తున్న పదవుల పందేరం గురించి గులాబీ దండులో జరుగుతున్న నిరీక్షణల పర్వం గురించి.
తెరాస అధికారంలోకి ఒచ్చి ఇరవై నెలలు గడుస్తూ ఒస్తున్నా కూడా పదవుల విషయంలో ఎప్పటికప్పుడు వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి.పోయిన సంవత్సరం వివిధ కారణాల వలన వాయిదా పడినా కొత్త సంవత్సరం లో జరుగుతాయి అని పార్టీ వర్గాలు అనుకున్న, కెసిఆర్ కూడా అదే ప్లాన్ చేసారు.
నామినేటేడ్ పదవులను త్వరలోనే భర్తీ చేయనున్నట్టు ఈమేరకు పార్టీ పొలిట్బ్యూరో సమావేశంలో స్వయంగా ప్రకటించారు కూడా.అయితే జనవరిలోగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను వెంటనే నిర్వహించాల్సిందిగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పదవుల పందేరం ఆగిపోయింది.
ఇప్పుడు వెంట వెంటనే గ్రేటర్ , నారాయణ ఖేడ్ లో రెచ్చిపోయిన తెరాస వరంగల్ , ఖమ్మం కార్పరేషన్ ఎన్నికల నిర్వాహణ కి కరెక్ట్ టైం అని భావిస్తోంది.
సో ఈనెల ఇరవై లోగా రెండు మునిసిపల్ కార్పరేషన్ లతో పాటు కొత్తగా ఏర్పాటు అయిన మున్సిపల్ పట్టణాలకి కూడా ఎన్నికలు నిర్వహించే తేదీ కి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతోంది.
ఈ ఎన్నికలకి ముందర పదవులు పంచేస్తే ఇబ్బంది అనేది కెసిఆర్ ఆలోచన.ఎందుకంటే అలా జేస్తే పార్టీకి పనిచెయ్యడం లో అలసట చూపించే అవకాశం కూడా.
ఉంది.శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చ్ మొదటి వారం లో మొదలు అవ్వబోతున్నాయి బడ్జెట్ సమావేశాలు మార్చ్ నెలాఖరు వరకూ సాగుతాయి.
దీంతో నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ మొదటివారంలో కసరత్తు ప్రారంభించి రెండోవారంలో నియామకాలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెరాస వర్గాల సమాచారం.