ప్రతీ పార్టీలో లుకలుకలు సామాన్యం, తెలంగాణా లో తెరాస లోకి టీడీపీ జనాలు ఒక్కరోక్కరు గా వెళ్ళిపోతూ ఉండడం తో పార్టీ అధినేత చంద్రబాబు కి పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారింది ఇదంతా.ఆ పార్టీ లో ఇప్పుడు తెలంగాణా లోనే కాక ఏపీ లో కూడా కొత్త లుకలుకలు మొదలు అవ్వడంతో ఆయన బీపీ పెరుగుతోంది.
విజయవాడ రామవరప్పాడు జాతీయ రహదారి పక్కన ఆక్రమణలు తొలగిస్తున్న సందర్భంలో రాస్తారోకో చేస్తున్న బాధితులను శాంతింపచేయడానికి వచ్చిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పోలీసులు కేసు నమోదు చేయడం ఇప్పుడు టిడిపిలో చర్చనీయాంశమైంది.
ఈ కేసుతో నేతల మధ్య విభేదాలు మరోసారి తెరమీదకు వచ్చాయి.
దీని వెనుక కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి దేవినేని హస్త ముందని పార్టీలోనే వంశీ అనుకూలురు భావిస్తున్నారు.తన ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకే ఎమ్మెల్యేను కేసులో ఇరికించారంట్నున్నారు.
రాజధాని ప్రాంతంలో ఇలా పార్టీ వారి మధ్యలో గొడవలు జరగడంతో చంద్రబాబు అస్సలు సంతోషంగా లేరు అని తెలుస్తోంది.పోలవరం కాల్వ నీటిని – కట్ట పట్టినీ గన్నవరం రైతులు వినియోగించుకునే విషయంలో ఎంపీ కేశినేని నానీ పడిన కష్టం చాలా ఎక్కువ ఉన్నా ఉమా దాన్ని తక్కువ చేసి చూపించారు అంటున్నారు.
ఫ్లై ఓవర్ విషయంలో బ్యానర్ ల దగ్గర నుంచీ అన్నింటా టీడీపీ తమ్ముళ్ళు కొట్టుకుంటూనే ఉన్నారు.
మరొక పక్క గుంటూరు జిల్లా లోని నరసరావుపేట ఎమ్ పి రాయపాటి సాంబశివ రావు సీమలో జెసి దివాకరరెడ్డి అప్పుడప్పుడూ చేసే మెరుపు వ్యాఖ్యలు కాపులకు ఉప ముఖ్యమంతి ఇచ్చినా ఆ వర్గానికి ఇచ్చిన హామీల అమలు విషయంలో ఇటీవల పెల్లుబికిన అసంతప్తి.
ఇలా అన్నీ చంద్రబాబునూ ఆలోచనలో పడేశాయంటు న్నారు.అందుకే పార్టీని పట్టిష్టం చేయాలని పథకాలకు ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించి ఆదిశగా చంద్రబాబు ఇటీవల పార్టీ ముఖ్యులు మంతులతో ఇటీవల ఒక సమావేశం కూడా నిర్వహించారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.







