కేసీఆర్‌కు జగన్ మీద కోపం వచ్చిందా?

తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలిసిన విషయమే.2019 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గెలుపు కోసం కేసీఆర్ సహకరించారన్న కామెంట్లు వినిపించాయి.

అవి నిజమో, అబద్ధమో పక్కన పెడితే పలు సందర్భాలలో సీఎం కేసీఆర్, జగన్ కలిసినప్పుడు ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా పలకరించుకున్నారు.

సీఎంగా జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి కూడా కేసీఆర్ హాజరయ్యారు.ఆ తర్వాత ఇద్దరిపై ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న దాఖలాలు కూడా కనిపించలేదు.కట్ చేస్తే.

రాష్ట్రపతి ఎన్నిక తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టింది.ఈ ఎన్నిక కారణంగా కేసీఆర్, జగన్ మధ్య లుకలుకలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

ఒకవైపు దేశంలో మోదీని కేసీఆర్ వ్యతిరేకిస్తున్న సమయంలో.ఏపీ సీఎం జగన్ మాత్రం మోదీకి మద్దతివ్వడం హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చి జగన్ తాను బీజేపీ పక్షం అని మరోసారి బలంగా చాటుకున్నారు.ఈ పరిణామంతో తెలంగాణ సీఎం కేసీఆర్ షాక్ తిన్నారు.

జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని భావించిన కేసీఆర్‌కు జగన్ విషయం ఇప్పుడు మింగుడుపడటం లేదు.జగన్ తోడుగా ఉంటే ఢిల్లీ రాజకీయాలను శాసించవచ్చని.జాతీయంగా వెలిగిపోవచ్చునని కేసీఆర్ కలలు కన్నారు.

కానీ ఇప్పుడు పొరుగు రాష్ట్రంలోనే తనకు వ్యతిరేకంగా గాలి వీయడాన్ని కేసీఆర్ సహించలేకపోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.మరోవైపు భారతీయ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేసి ఏపీ ప్రజల మనసును కూడా గెలుచుకోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.

తాము తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రమే కోరుకున్నాం కానీ ఏపీకి అన్యాయం జరగాలని తమ అభిమతం కాదని వివరిస్తూ ఏపీలోనూ పాగా వేయాలని కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు.అంతేకాకుండా 2024 ఎన్నికల్లో జగన్ మీద తన కోపాన్ని చూపించాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు టాక్ నడుస్తోంది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య విభేదాలు ఏ స్థాయికి చేరతాయో కాలమే సమాధానం చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు