తిరుమల బ్రహ్మూెత్సవాలకు తెలంగాణ సీఎం

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలుగు రాష్ట్రాల మద్య స్నేహం చిగురిస్తోంది.ఇరు రాష్ట్రాల మద్య స్నేహం పెరుగుతోంది.

కేంద్రం సహకారం లేకుండానే విభజన వల్ల ఏర్పడిన సమస్యలను తొలగించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఏపీలో జగన్‌ అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్‌ తనవంతు సాయం చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది.

ఈ నేపథ్యంలోనే జగన్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నాలుగు నెలలు కాకుండానే అప్పుడే రెండు సార్లు భేటీ అయ్యాడు.తాజాగా ప్రగతి భవన్‌లో మరోసారి సీఎం కేసీఆర్‌తో జగన్‌ భేటీ అయ్యాడు.

ఈ సందర్బంగా పలు విభజన సమస్యలపై ముఖ్యమంత్రులు ఇద్దరు చర్చించుకున్నారు.ఆ తర్వాత త్వరలో తిరుమలలో జరుగబోతున్న బ్రహ్మూెత్సవాల్లో పాల్గొనాల్సిందిగా కేసీఆర్‌కు జగన్‌ ఆహ్వానం అందించారు.

Advertisement

కుటుంబ సమేతంగా తప్పకుండా బ్రహ్మూెత్సవాలకు హాజరు అవ్వాలని జగన్‌ కోరారు.బ్రహ్మూెత్సవాల్లో పాల్గొనేందుకు కేసీఆర్‌ ఓకే చెప్పడం జరిగింది.

జగన్‌ సీఎం అయిన తర్వాత తిరుమలకు వెళ్లిన కేసీఆర్‌కు ఘన స్వాగతం దక్కింది.ఇప్పుడు మరోసారి ఆయన తిరుమలకు వెళ్లబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు