రేపటి నుంచి అంటే మార్చి 4 నుంచి మహిళల వన్డే ప్రపంచ కప్ ప్రారంభమవుతుంది.ఈ టోర్నమెంట్ లో భారత మహిళల జట్టుతో పాటు మరో ఏడు టీమ్స్ పాల్గొననున్నాయి.
న్యూజిలాండ్ వేదికగా ఈ టోర్నమెంట్ జరగనుంది.అయితే టోర్నీ స్టార్ట్ కావడానికి ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉండటంతో ఇప్పటికే అన్ని జట్లు రెండు వార్మప్ మ్యాచ్ లను ఆడేశాయి.
టీమిండియా మహిళా క్రికెటర్లు గత నెలలోనే న్యూజిలాండ్ దేశానికి చేరుకున్నారు.ఆ సమయంలో మిథాలీ రాజ్ కెప్టెన్ గా టీమిండియా జట్టు కివీస్ టీంతో వన్డే సిరీస్ ఆడింది.
కానీ చాలా పేలవమైన ఆట ప్రదర్శనతో ఓటములను చవిచూసింది.దీన్ని బట్టి చూస్తుంటే 2022లో కూడా వరల్డ్ కప్ లో టీమిండియా ఓడిపోవడం తప్పదని అనిపిస్తుంది.
ఇదిలా ఉండగా ప్రపంచకప్ కు ముందు జరిగిన రెండు వార్మప్ మ్యాచ్ ల్లో టీమిండియా గెలుపొంది ఆశ్చర్యపరిచింది.ఫస్ట్ మ్యాచ్ లో సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్ తరువాత వెస్టిండీస్ పైచేయి సాధించింది.
మరి మార్చి 6వ తేదీన పాకిస్థాన్ తో జరిగే ప్రపంచ కప్ మ్యాచ్ లో టీమిండియా గెలుస్తుందో లేదో చూడాలి.ఈ క్రమంలోనే ప్రీ-వరల్డ్ కప్ ఫొటోషూట్ లో పాటిస్పేట్ చేసిన భారత క్రికెటర్లు చాలా సందడి చేశారు.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజాగా జరిగిన ప్రీ వరల్డ్ కప్ ఫొటోషూట్ లో టీమిండియా ఫొటోలు దిగడం వరకే పరిమితం కాలేదు.వీరంతా కూడా అంతకుమించిన సందడి చేస్తూ అదరగొట్టారు.వీరు హీరోయిన్ల లెవల్లో ఫొటోలకు ఫోజులిచ్చారు.
అలానే ఒక క్రికెటర్ డ్యాన్స్ చేస్తూ ఫొటోషూట్ ను మరింత సందడిగా మలిచారు.టీమిండియా వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ భాంగ్రా స్టెప్పులు వేస్తూ చూపు తిప్పుకొనివ్వకుండా చేసింది.
ఈ వీడియో చూసిన టీమిండియా ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.వావ్, సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఈ వీడియోని ఐసీసీ తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో షేర్ చేసింది.దీనిపై మీరు కూడా ఒక లుక్కేయండి.