కూకట్ పల్లి లో జనసేన ఓటింగ్ ని చూసి హడలిపోతున్న టీడీపీ -వైసీపీ..కారణం ఇదే!

తెలంగాణ ఎన్నికలు ముగిసాయి.అందరూ ఊహించినట్టుగానే బీఆర్ఎస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోగా, కాంగ్రెస్ 69 స్థానాల్లో విజయకేతనం ఎగరవేసి సెన్సేషన్ ని సృష్టించింది.

 Tdp ,ycp Who Are Worried About Jana Sena Voting In Kukatpally This Is The Reason-TeluguStop.com

నేడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్నాడు.ఇదంతా పక్కన పెడితే ఈ ఎన్నికలకు మన పార్టీలు మొత్తం దూరంగా ఉన్నప్పటికీ, జనసేన పార్టీ మాత్రం పోటీ చెయ్యడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

సరైన ప్లానింగ్, సరైన విధానం లేకుండా కేవలం 10 రోజుల ముందు అభ్యర్థులను ప్రకటించి పోటీలో నిలబెట్టింది.ఒక్క కూకట్ పల్లి లో మినహా,మిగిలిన 8 స్థానాల్లో డిపాజిట్స్ కూడా దక్కకపోవడం మనమంతా చూసాము.

సరైన ప్లానింగ్ తో వెళ్లకపోతే తెలంగాణ జిల్లాలలో ఓటింగ్ పడదు అనే విషయం అందరికీ తెలిసిందే.అందులోనూ బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వా నేనా అనే రేంజ్ హోరాహోరీ పోరు ఉన్న సమయం లో జనసేన పార్టీ కి డిపాజిట్స్ ఆ ప్రాంతాలలో దక్కకపోవడం అనేది పెద్ద ఆశ్చర్యం ఏమి కాదు.

కానీ కూకట్ పల్లి లో మాత్రం జనసేన కి డిపాజిట్ దక్కింది.16 శాతం ఓటింగ్ తో దాదాపుగా 40 వేల ఓట్లు నమోదు అయ్యాయి.ఇది సాధారణమైన విషయం అయితే అసలు కాదు.ఎందుకంటే అవతల బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా డబ్బులు పంచడం వంటివి చేస్తుంది.కానీ జనసేన మాత్రం అలాంటి కార్యక్రమాలు ఏమి చెయ్యలేదు.పవన్ కళ్యాణ్ కేవలం ఒక రోడ్ షో మరియు ఒక భారీ బహిరంగ సమావేశం ని మాత్రమే ఏర్పాటు చేసాడు.

మిగిలిన పార్టీలు లాగా రెండు మూడు నెలలు పక్కా ప్లానింగ్ చేసుకుంది అసలు లేదు.కేవలం పవన్ కళ్యాణ్ చరిష్మా తో అంత తక్కువ సమయం లో ఆ స్థాయి ఓటింగ్ వచ్చిందంటే సాధారణమైన విషయం కాదు.

టీడీపీ ఓటర్లు నేరుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ కి సపోర్ట్ చేసాడు, అలాగే బీజేపీ పార్టీ క్యాడర్ కూడా ఇంటర్నల్ గా బీఆర్ఎస్ పార్టీ కి సపోర్ట్ చేసింది.

-Telugu Political News

అలా ఏ పార్టీ సపోర్ట్ లేకుండా కేవలం ఒకేఒక్క రోడ్ షో , మరియు బహిరంగ సభ తో ఇంతమంది ఓటర్లను ఆకర్షితం చేసాడంటే, రాబొయ్యే ఆంధ్ర ఎన్నికలలో జనసేన పార్టీ ప్రభంజనం ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.ఎందుకంటే కూకట్ పల్లి లో ఎక్కువగా మన ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించిన వాళ్ళే ఉంటారు.వాళ్ళు పవన్ కళ్యాణ్ ని ఇంత పోటీ వాతావరణం లో కూడా తేలికగా తీసుకోలేదు అనే విషయం నిరూపితం అయ్యింది.

రెండు నెలల నుండి సరైన ప్లానింగ్ తో పోటీ చేసి ఉంటే కచ్చితంగా జనసేన ఈ స్థానం గెలిచి కూడా ఉండేదని అంటున్నారు విశ్లేషకులు.ఇప్పుడు ఈ ఫలితం ని తేలికగా తీసుకుంటే వైసీపీ కి పెద్ద ఎదురు దెబ్బ తగలక తప్పదు.

అలాగే టీడీపీ తో కూడా పొత్తులో సీట్ షేరింగ్ విషయం లో జనసేన డిమాండ్ చేసినన్ని సీట్స్ ఇవ్వాలి.మరి ఏమి జరగబోతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube