వైస్సార్ సీపీ కార్యకర్తలు తప్పుడు తన పై తప్పుడు ట్రోలింగ్ చేస్తున్నారని పాయకరావుపేట లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ నిన్న మహిళా దినోత్సవం సందర్బంగా అన్నమయ్య జిల్లా పీలేరు లో నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర లో పాల్గొన్నానని తెలిపారు.
పాదయాత్ర అనంతరం మహిళలు తో ముఖాముఖీ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు.ఈ సందర్భంలో జగన్ మోహన్ రెడ్డి ని గద్దె దించి చంద్రబాబు ని సీఎం చేయడానికి రాష్ట్ర మహిళలు అంతా సిద్ధంగా ఉన్నారని అని మాట్లాడటం జరిగిందన్నారు.
ఆ వ్యాఖ్యలను ఎడిటింగ్ చేసి కొందరు వైస్సార్సీపీ కార్యకర్తలు చంద్రబాబు ని గద్దె దింపి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రి చేయాలని నేను చెప్పినట్లు తప్పుడు గా ప్రచారం చేయడం పై ఆమె మండి పడ్డారు.
పనికిమాలిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ పేటియం బ్యాచ్ తో నాపై అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఇలా చేయడం పై అసహనం వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఎంతగా దిగజారిపోయారంటే ఆ పేటియం బ్యాచ్ నాపై తప్పుగా ట్రోల్ చేసిన విషయాన్ని తన ఛానల్ సాక్షి మీడియా లో వేసే స్థాయి కి దిగజారుతున్నారని తీవ్ర విమర్శలు చేసారు.అంతే కాకుండా నా పై తెదేపా పార్టీ యాక్షన్ తీసుకున్నట్లు అచ్చయ్య నాయుడు పేరిట ఫేక్ లెటర్ ప్యాడ్ ను తయారు చేసి సోషల్ మీడియాలో హాల్ చల్ చేయడం చూస్తుంటే నేను అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారని ఎద్దేవాచేశారు.