మొదటిసారి టీడీపీ.. అలా ముందుకు వెళ్తోంది !

తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గట్టి పోటీనే ఎదుర్కుంటోంది.ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోరు హోరా హోరీగా సాగేలా కనిపిస్తోంది.

36 ఏళ్ళ సుదీర్ఘ చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఏదో ఒక పార్టీ తో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్ళేది.1983 నుంచి 2014 ఎన్నికల వరకు చూసుకుంటే ఇదే అర్ధం అవుతుంది.ఈ సారి మాత్రం ఒంటరిగా ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గత మూడున్నర దశాబ్దాలుగా టీడీపీ చరిత్ర చూస్తే బీజేపీ లేదా వామపక్ష పార్టీలతో కలసి పోటీ చేస్తూ వచ్చేది.టీడీపీ ఆవిర్భవించిన 1983 సంవత్సరంలోనే మేనకా గాంధీకి చెందిన సంజయ్ విచార్ మంచ్ పార్టీతో కలసి పోటీ చేసింది.1983 ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించడమే కాదు తొలిప్రయత్నంలోనే అధికారాన్నిదక్కించుకోగలిగారు.1984 ఎన్నికల్లో మాత్రం బీజెపీతో కలసి టీడీపీ ఎన్నికల పొత్తు కుదుర్చుకొంది.దేశమంతా వ్యతిరేకపవనాలు వీచినా ఏపీలో మాత్రం టీడీపీ కూటమి విజయం సాధించడమే కాదు లోక్ సభలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది.1989 ఎన్నికల్లో మాత్రం టీడీపీ అదే కూటమితో ఎన్నికల బరిలో దిగి ఘోర పరాజయం ఎదుర్కొంది.1994 ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో కలసి పోటీ చేసిన టీడీపీ విజయం దక్కించుకుంది.

టీడీపీతో కలసి పోటీ చేయడం ద్వారా వామపక్ష పార్టీలు బాగా లబ్ది పొందాయి.1995 ఎన్నికల సమయంలో టీడీపీ రెండుగా చీలి ఎన్నికల బరిలోకి దిగింది.ఎన్టీఆర్ స్థానంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు.1996 ఎన్నికల్లో వామపక్షాలతో కలసి పోటీ చేసిన టీడీపీ 1998లో లోక్ సభకు మధ్యంతర ఎన్నికల్లోనూ వామపక్షాలతోనే పొత్తు కొనసాగిస్తూ వచ్చింది.1999లో బీజెపీతో కలసి పోటీ చేసిన టీడీపీ అధికారం సాధించింది.చంద్రబాబు రెండోసారి సీఎం పదవిని పొందారు.2004 ఎన్నికల్లో బీజెపీ టీడీపీ కూటమి ఘోర పరాజయం పాలయ్యింది.ఆ తరువాత బీజేపీ - టీడీపీ బంధం ఆగిపోయింది.2009 ఎన్నికల్లో మిగిలిన పక్షాలతో కలసి టీడీపీ కూటమి కట్టినా విజయం వరించలేదు.ఏపీ విభజన నేపథ్యంలో జరిగిన 2014 ఎన్నికల్లో బీజెపీతో కలసి మరోసారి ఎన్నికల బరిలో నిలిచిన టీడీపీ అధికారం అందుకొంది.

ఆ పొత్తు కారణంగా టీడీపీ- బీజేపీ బాగానే లాభపడినా ఆ స్నేహం మధ్యలోనే ఆగిపోవడంతో ఇప్పుడు ఒంటరిగా ఎన్నికల బరిలోకి వెళ్తోంది.

Advertisement

పవన్ కళ్యాణ్ పై ఎన్నికల సంఘానికి మరో ఫిర్యాదు..!!

Advertisement

తాజా వార్తలు