పెట్రోల్ ధరల పెరుగుదలపై 28న టీడీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

పెట్రోల్, డీజిల్ నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై ఈనెల 28న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.ఆయన సోమవారం పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు చెల్లింపు విషయంలో రూ.413 కోట్ల డిపాజిట్ చేశామని ప్రభుత్వం చెబుతున్నా.అవి కాంట్రాక్టులకు అందలేదన్నారు.కేంద్రం రూ.1,991 కోట్ల జాతీయ ఉపాధి హామీ పథకం బకాయిలను విడుదల చేయగా.వాటీని ఇవ్వకుండా దారి మళ్లించారని కోర్టు ఆదేశాలను సైతం అమలు చేయలేదన్నారు.

 Tdp State Wide Protests Over The Increasing Petrol Prices On August 28, Tdp ,sta-TeluguStop.com

దళిత విద్యార్థిని రమ్య హత్య కేసు విషయంలో జాతీయ ఎస్సీ కమిషన్ రాష్ట్రానికి రానుందని, ఈ సందర్భంగా రాష్ట్రంలో గత రెండేళ్లలో జరిగిన అత్యాచారాలు, హత్యలు, అట్రాసిటీ చట్టం పై తెలుగుదేశం పార్టీ తరఫున నీవేదక అందజేయాలని  ఈ సమావేశంలో తీర్మానించారు.అగ్రిగోల్డ్ విషయంలో బాధితులకు మొత్తం నగదు ఇవ్వాలని ఆ సంస్థ ఆస్తులు  తక్కువ విలువకు దారాదత్తం చేయడానకి వీల్లేదన్నారు.

దశల వారీగా మధ్య నిషేధం పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి మాట తప్పారు.నాసిరకం మద్యం, ధరలు పెంచి ప్రజలను దోచుకుంటున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు.

Telugu Ap, August, Petrol, Telugu Desam-Political

జగన్ రెడ్డి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు కోవిడ్ నియంత్రణలో కూడా జగన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని అన్నారు.ఈ సమావేశంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు కె అచ్చెన్నాయుడు, సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, కాలవ శ్రీనివాసులు, నిమ్మల రామానాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నిమ్మకాయల చినరాజప్ప, పి.అశోక్ బాబు, బండారు సత్యనారాయణమూర్తి, బొండా ఉమా తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube