రాజకీయ ప్రత్యర్థులు బల పడకూడదు అంటే వారిని చూసి దెబ్బ తీయాలి.వారు ఏ విధంగా దెబ్బతింటారో ఆ విధంగా సరికొత్త వ్యూహాలను రచించి వాటిని అమలు చేయాలి.
అప్పుడే సునాయాసంగా రాజకీయంగా పైచేయి సాధించేందుకు అవకాశం ఏర్పడుతుంది.అలాకాకుండా శత్రువులు బల పడే విధంగా తమ వ్యూహాత్మక తప్పిదాల తో ముందుకు వెళ్తే ఎలా ఉంటుందో ఏపీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని చూస్తేనే అర్థమవుతుంది.వైసిపి ప్రభుత్వం పై టీడీపీకి , ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు పీకల్లోతు కోపం ఉంది.151 సీట్లతో జగన్ అధికారంలోకి రావడం ప్రజలతో మమేకం కావడం ఇవన్నీ చంద్రబాబుకు ఏమాత్రం నచ్చని విషయాలు.ఏదో రకంగా వైసిపి ప్రభుత్వ ప్రతిష్ఠను మసకబార్చడం ద్వారానే తాము అధికారంలోకి రావాలనేది చంద్రబాబు ఎత్తుగడగా కనిపిస్తోంది.
ఇప్పటికీ రకరకాల మార్గాల ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసే విషయంపై బాబు దృష్టి పెట్టారు.
ఈ నేపథ్యంలోనే వైసిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం బయటకు రావడంతో టిడిపి సంబరపడింది.ఆయన ద్వారా తమ రాజకీయ పంతం నెరవేర్చుకోవాలనే విధంగా కొత్త రాజకీయం మొదలు పెట్టింది.
రఘు రామ విమర్శలకు తమ పార్టీ అనుకూల మీడియా ద్వారా ఎక్కువ ప్రచారం కల్పించి, రఘురామ ప్రభుత్వంపై చేసే విమర్శలను హైలెట్ చేస్తూ, వస్తోంది .రఘురామ అదే పనిగా వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తుండడంతో, తమకు పెద్దగా పని లేకుండానే తమ పని చేసి పెడుతున్నారనే ఆనందంలో టిడిపి ఉంటూ వచ్చింది.రఘు రామ చేస్తున్న విమర్శలు జనాల్లోకి వెళ్లకపోవడం , వైసిపి ప్రభుత్వం పై జనాల్లో టిడిపి ఆశించినంత స్థాయిలో వ్యతిరేకత కనిపించకపోవడం, ఆయన విమర్శలను ఎవరు పెద్దగా పట్టించుకోనట్లు వ్యవహరిస్తుండడం ఇలా ఎన్నో అంశాలు వైసీపీ ప్రభుత్వానికి క్రెడిట్ తీసుకువస్తున్నాయి.

పైగా జగన్ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు టిడిపి ప్రోత్సహిస్తోందని, ఇదంతా కుట్రగా జనాల్లోకి వెళ్ళి పోతూ ఉండటం ఇవన్నీ టిడిపికే ఇబ్బందికరంగా మారాయి .ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ముందుండి పోరాడాల్సిన టిడిపి రఘురామ ద్వారా రాజకీయం చేస్తూ ఉండటం తో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీ కంటే రఘురామ వ్యవహారమే హైలెట్ అవుతోంది.ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలవుతోంది.
మరో రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఎన్నికలకు సమయం ఉంది.ఈలోపు ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ బలపడే అంశాలపై దృష్టి పెట్టకుండా వారిని వెనక్కి నడుస్తూ ఉండటం వల్ల ఆయనకు , జగన్ కు క్రెడిట్ వస్తుంది తప్ప, టీడీపీకి కలిసి వచ్చేది ఏమీ లేదనే విషయం అర్థమవుతోంది.
ఈ విషయాన్ని టిడిపి ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది.లేకపోతే టిడిపి ఈ అనాలోచిత నిర్ణయం వల్ల వైసీపీ కి మరింత ఆదరణ పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.