ఆ ట్వీట్లతో పవన్ తన స్థాయి తగ్గించుకుంటున్నాడా ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని ముందుకు తీసుకువెళ్లే క్రమంలో వేస్తున్న అడుగులు తప్పటడుగుల్లా మారుతున్నట్టుగా అందరికి కనిపిస్తుంన్నాయి.రాజకీయంగా పార్టీకి ఊపు తీసుకురావాలని చూస్తున్న పవన్ అందుకు ప్రభుత్వాన్ని విమర్శించడం, ప్రజా ఉద్యమాలు, పోరాటాలు చేయడం ద్వారానే గుర్తింపు సాధించడంతో పాటు రాజకీయంగా జనసేన కు ఎదురులేకుండా చేయవచ్చు అనే భావనలో ఉన్నాడు.

 Pawan Kalyan Tweets About Jagan Announce Three Capitals In Ap-TeluguStop.com

అయితే ఈ సందర్భంగా పవన్ ఎంచుకున్న మార్గం సరైనదే అన్నట్టుగా పైకి కనిపిస్తున్నా జనసేన ఇమేజ్ ను రోజు రోజుకి దెబ్బ తీయడంతో పాటు పవన్ పై ఆ పార్టీ నాయకులకే నమ్మకం లేకుండా చేస్తోంది.ఈ విషయాలు పవన్ కు తెలిసి జరుగుతున్నా తెలియక జరుగుతున్నా జరగాల్సిన నష్టం అయితే జరిగిపోతూనే ఉంది.

ఇక ప్రభుత్వ విధానాలపై, పథకాల అమలు తీరుపైనా విమర్శలు కురిపిస్తున్న పవన్ ఆ విధంగా పార్టీ ఉనికి ప్రజల్లో ఉండేలా చేస్తున్నా, అదే స్థాయిలో అపవాదు ని కూడా మూటగట్టుకుంటున్నాడు.

Telugu Jagan Ap Cm, Jagancontinuee, Janasenapawan, Pawan Kalyan, Pawankalyan-

తాజాగా మూడు ప్రాంతాల్లో రాజధానిని విస్తరించవచ్చవచ్చు అంటూ జగన్ అసెంబ్లీ లో జగన్ ప్రకటించడాన్ని కూడా పవన్ తప్పుపడుతున్నారు.దీనిపై వరుస వరుసగా ట్విట్లు చేస్తూ హడావుడి చేస్తున్నాడు.హై కోర్టు కర్నూలులో పెడితే శ్రీకాకుళం నుంచి కర్నూలుకి వెళ్ళాలా, అనంతపురం నుంచి ఉద్యోగులు విశాఖపట్నం వెళ్లి ఉద్యోగాలు చేయాలా సామాన్య ప్రజలకు ఏదైనా కోర్టు లేదా సెక్రెటేరియట్‌లో పని వుంటే వెళ్ళటం సాధ్యమయ్యే పనేనా అంటూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సోషల్‌ మీడియా వేదికగా అనేక ప్రశ్నలు వేశారు పవన్.

ఏపీ సీఎం జగన్ రాజధాని నిర్మాణంపై చేసిన ప్రసంగానికి పవన్ రిప్లై ఇది.అంటే రాజధానిని మూడు ప్రాంతాల్లో విస్తరించడం పవన్ కు ఇష్టం లేదు అనే విషయం బాగా అర్ధం అవుతోంది.దీంతో మూడు ప్రాంతాల్లోనూ పవన్ ట్విట్లపై విమర్శలు చెలరేగుతున్నాయి.

Telugu Jagan Ap Cm, Jagancontinuee, Janasenapawan, Pawan Kalyan, Pawankalyan-

ప్రస్తుతానికి అమరావతిలోనే ఏపీ హైకోర్టు ఉంది.శ్రీకాకుళం నుంచి ప్రజలు అమరావతికి వెళ్ళడం లేదా అమరావతిలోనే సచివాలయం ఉంది.అక్కడికి ఉద్యోగులు వెళ్ళడంలేదా ? కోర్టు పనులు ఉన్నవారు ఆ కోర్టు అవసరాల నిమిత్తం కోర్టు ఎక్కడ వుంటే అక్కడికి వెళ్తున్నారు.సెక్రెటేరియట్‌ విషయమైనా అదే పరిస్థితి.అన్నీ ఒకే చోట ఉంటే కొంత సౌకర్యం ఉంటుంది అనే విషయం వాస్తవమే అయినా రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలంటే ఆయా ప్రాంతాల్లో ప్రతిపాదనలు తప్పనిసరి.

నిజానికి, పవన్‌ ప్రశ్నించాలనుకుంటే దానికి తగ్గట్టుగా ఆయన కొంత ముందుగా ప్రిపేర్ అవ్వాలి.లోతుగా ఈ విషయాలపై అధ్యయనం చేసి మూడు ప్రాంతాల జనసేన నాయకుల అభిప్రాయాలు ఏంటో తెలుసుకుని ముందుకు వెళ్తే బాగుంటుంది తప్ప ఇంత హడావుడిగా ట్విట్లు చేయడం పవన్ లో ఉన్న తొందరపాటుని తెలియజేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube