అశోక్ గజపతి రాజు కు వైసీపీ సర్కార్ ఝలక్

మాన్సన్ ట్రస్ట్ చైర్మన్ అయిన అశోక్ గజపతి రాజు కు వైసీపీ ప్రభుత్వం గట్టి ఝలక్ ఇచ్చింది.

టీడీపీ నేత అశోక్ గజపతి రాజు మాన్సన్ ట్రస్ట్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

అయితే గత ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా ఆయనే కొనసాగుతున్నారు.ఈ నేపథ్యంలోనే తాజాగా బుధవారం అశోక్ గజపతి రాజును తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తుంది.

దీనితో ఈ రోజే మాన్సన్ ట్రస్ట్ చైర్మన్ గా సంచిత గజపతి రాజు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తుంది.దీనితో సింహాచలం ఆలయ చైర్మన్ గా సంచిత భాద్యతలు చేపట్టనున్నారు.

ట్రస్ట్ చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతి రాజు కుటుంబానికే చెందిన వైసీపీ నేత ఆనంద గజపతిరాజు కుమార్తె సంచిత గజపతిరాజు.మాన్సన్ ట్రస్ట్ చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతి రాజు ను ఆ పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసి ఆయన స్థానాల్లో సంచిత చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

Advertisement

సంచిత గజపతిరాజు ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు.మాన్సన్ ట్రస్ట్ కు 108 ఎకరాలు - 14800 ఎకరాల భూములున్నాయి.

దేవాలయాల నిర్వహణ చూసే ఈ అతిపెద్ద ట్రస్ట్ ఇప్పటివరకు అశోక్ గజపతి రాజు చేతిలో ఉండగా ఇప్పుడు తాజాగా ఆయన నుంచి చేతులు మారి వైసీపీ పార్టీ నేతకు పగ్గాలు అందించారు.

Advertisement

తాజా వార్తలు