జనసేన- టీడీపీ సీట్ల లెక్కలు ఇవే..

జనసే.టిడిపి ఇద్దరి పొత్తు ఖాయమేనా.

? వచ్చే ఎన్నికల్లో ఇద్దరు కలిసి పోటీ చేస్తారా అంటే అవుననే అంటున్నారు టిడిపి నేతలు.ఈ లెక్కలో గతకొన్ని రోజులుగా టిడిపి- జనసేన పొత్తుపై వస్తున్న రూమర్లకి చెక్ పడినట్లే అంటున్నారు.

అయితే గతంలోనే పొత్తు పెట్టుకున్న బీజేపి తో టిడిపి అనుభందం తెగిపోనున్న తరుణంలో చంద్రబాబు జనసేనతో పొత్తు కి సిద్దం అయిపోయారు.వీరి భందం ఈ పొత్తు ద్వారా మరింత బలంగా మారనుంది.

ఇదిలా ఉంటే చంద్రబాబు అంచనాల ప్రకారం వచ్చే ఎన్నికల్లో సుమారు 40 నియోజక వర్గాలు టిడిపి ప్రభుత్వానికి ఎదురు గాలులు వీచేలా ఉన్నాయి దాంతో ఈ లోటుని జనసేన పొత్తుతో భర్తీ చేయనున్నారు చంద్రబాబు అందుకు తగట్టుగానే వ్యూహాలు పన్నుతున్నారు.అయితే పవన్ కూడా ఒంటరిగా పోటీ చేయలేరు.

Advertisement

అంతేకాదు.గ్రామస్థాయిలో కూడా బలమైన కేడర్ లేదు అంచేత పొత్తుకి ఒకే చెప్పక తప్పదు అంటున్నారు.

అయితే పవన్ చాలా సార్లు ప్రజాభిమానం ఎక్కువగా ఉంది ఏపీ ని అభివృద్ధి వైపు తీసుకుని వెళ్ళే నాయకులతో కలుస్తానని చెప్పడం బాబు –పవన్ ల పొత్తుకి నిదర్సనం అంటున్నారు.అయితే పొత్తు ఒకే అయితే చంద్రబాబు జనసేన కి ఇచ్చే సీట్లు విషయంలో ఆసక్తికరమైన న్యూస్ హల్చల్ చేస్తోంది.

ఏపీ కి ఉన్న 13 జిల్లాలలో ఒక్కో జిల్లా నుంచీ ఇద్దరు చప్పున మొత్తం 26 సీట్లు జనసేనకి చంద్రబాబు ఇవ్వనున్నారని టాక్.అయితే ఈ లెక్కలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 26 అవుతాయి.

అయితే పార్లమెంటు స్థానాలు మాత్రం 5 ఇవ్వనున్నారు.అని తెలుస్తోంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు

అయితే ఈ లెక్కలు సరిగ్గా అమలు అయితే మాత్రం పక్కాగా ఈ సారి కూడా చంద్రబాబు మళ్లీ ఏపీ మ్కుఖ్యమంత్రి అవ్వడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Advertisement

తాజా వార్తలు