నగరిలో రోజాకి కొత్త టెన్షన్..రీజన్ ఇదే

రోజా వైసీపి ఫైర్ బ్రాండ్.సీనియర్ లేదు జూనియర్ లేదు ఎవరి మీదైనా సరే నోరేసుకుని పడిపోవడంలో ఆమెకి ఆమె సాటి.

 Roja Feel Fear In Nagari Reasons Is ..-TeluguStop.com

ఆమె అంటేనే భయపడిపోయే నేతలు కూడ ఉన్నారు.ఆమె టంగ్ పవర్ అలాంటిది మరి అయితే ఇప్పుడు రోజాకి చుక్కలు కనిపిస్తున్నాయి.

భయంతో వణికిపోతోంది అంటున్నారు నగరి నోయోజక వర్గం నేతలు.రోజా ఏంటి భయపడటం ఏంటి అంటూ అందరు ఆశ్చర్యపోతున్నారు.

ఇంతకీ రొజాని భయపెడుతున్నది ఎవరు అనంటే.

ఫైర్ బ్రాండ్ నే షేక్ ఆడిస్తున్నది ఎవరు కాదు ఆమె నియోజకవర్గం పేరు.

నగరి అంటేనే రోజా భయంతో వణికిపోతోంది అంటున్నారు.వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు భ‌విష్య‌త్తు ఉండ‌దేమోన‌ని కూడా రోజా క‌ల‌వ‌రిస్తోంద‌ని అనుకుంటున్నారు.

ఎంతో ధైర్యంగా ఉండే రోజా.ఇంతలా అయిపోవడానికి కారణం ఎంతనే వివరాలలోకి వెళ్తే.

నగ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో ఎంతో కీలకమైన వ్యక్తి గా ఉంది అక్కడ చక్రం తిప్పిన నాయకుడు.ప్ర‌జ‌ల‌కు త‌ల‌లో నాలుక మాదిరిగా ఉన్న ఎమ్మెల్సీ ముద్దు కృష్ణ‌మ నాయుడు ఇటీవ‌ల హ‌ఠాన్మ‌ర‌ణం ఇప్పుడు రోజాను ఒణికింప జేస్తోంది…ప్రజలతో ఎంతో అనుభందం ఉన్న నేతకావడంతో ఇప్పుడు ఎక్కడ చుసిన ఆయన మరణం గురించే చర్చలు చేసుకుంటూ తలుచుకోవడంతో సింపతీ పెరిగిపోయింది.

ముద్దుకృష్ణమకి శత్రువులు ఎవరు లేరు.రాజకీయంగా పోటీ తప్ప ఆయన అందరికీ అజాత శత్రువు లాంటివారు.అందుకే జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడు చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి సైతం.ముద్దుకృష్ణ‌మ మృతి ప‌ట్ల క‌న్నీరు పెట్టాడంటే.

గాలికి ఉన్న ఆద‌ర‌ణ ఎంతో ఇట్టే అర్ధ‌మ‌వుతుంది…అంతేకాదు ఆయన భౌతికకాయాన్ని వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మరో సీనియర్‌ నాయకుడు భూమన కరుణాకరెడ్డి కూడా మోసి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటిచెప్పారు.అంతేకాదు కాంగ్రెస్‌ నాయకులు.

ఇతర పార్టీల నాయకులు కూడా ఆయన నగరికి చేసిన అభివృద్దిని మెచ్చుకుంటూ మాట్లాడారు.వచ్చే ఎన్నికల్లో ముద్దు కుటుంబం నుంచి ఎవరి బరిలోకి దిగినా.

భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని అనుకుంటున్నారు.

అయితే ఇప్పుడు ఇదే రోజా భయానికి కారణం అయ్యాయి.

అయితే తనకి వేరే సెగ్మెంట్ ఇవ్వమని రోజా జగన్ నీ కోరిందని తెలుస్తోంది.అయితే గతంలో రోజాకి నగరి టిక్కెటు ఇస్తే ఓడిపోవడం ఖాయం అని పేకీ రిజల్ట్స్ లో బయటపెట్టాడు కూడా.

అయితే అదే సమయంలో జగన్ రోజాకి టిక్కెట్ ఇవ్వరనీ అర్థమయిపోయింది.దాంతో రోజాకి నగరిలో టిక్కెట్ ఇచ్చినా ఇవ్వక పోయినా రోజా రాజకీయ భవిష్యత్తు మత్రామం గోవిందా అంటున్నారు విశ్లేషకులు.

మరి రోజా ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube