టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్.. విజయవాడకు తరలింపు.!!

ఏపీ రాజకీయాలలో కలకలం చెలరేగింది.టీడీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.

నంద్యాలలో ఉన్న చంద్రబాబును అర్ధరాత్రి సమయంలో అదుపులోకి తీసుకున్నారని సమాచారం.ఈ క్రమంలో పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది.

అరెస్ట్ చేసిన అనంతరం చంద్రబాబును విజయవాడకు తరలించారని తెలుస్తోంది.కాగా అరెస్ట్ చేసే సమయంలో ఏ చట్ట ప్రకారం తనను అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని చంద్రబాబు పోలీసులను ప్రశ్నించారు.

ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎలా అదుపులోకి తీసుకుంటున్నారని నిలదీశారని తెలుస్తోంది.అయితే దీనిపై తాము హైకోర్టుకు ప్రాథమిక ఆధారాలు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

కాగా టీడీపీ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్ మెంట్ లో జరిగిన కుంభకోణంపై సీఐడీ, ఈడీ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ కేసులో చంద్రబాబు పాత్రపై ఏపీ వ్యాప్తంగా పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.

దీంతో ఇదే కేసులో మరి కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం.చంద్రబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం విజయవాడకు తరలించారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు